Home Sports Adda “కేఎల్ రాహుల్ అలా చేస్తే అస్సలు ఊరుకోము..!” అంటూ… PBKS ఓనర్ షాకింగ్ కామెంట్స్..!

“కేఎల్ రాహుల్ అలా చేస్తే అస్సలు ఊరుకోము..!” అంటూ… PBKS ఓనర్ షాకింగ్ కామెంట్స్..!

by Mohana Priya

ఐపీఎల్ 2022 వేలం జరిగింది. అన్నీ జట్లు తమ ప్లేయర్లని ప్రకటించారు. ఇందులో కొన్ని షాకింగ్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సీనియర్ ప్లేయర్లతో పాటు, కొంత మంది యువ ప్లేయర్లని కూడా ఎంపిక చేసారు.

ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ టీం నుండి కే ఎల్ రాహుల్ రిలీజ్ అయ్యారు.  రిటైనింగ్ ప్రక్రియ పూర్తి అవ్వకముందే రాహుల్ లక్నో జట్టుతో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. రాహుల్ వేరే జట్టుతో చర్చలు జరిపడంపై పంజాబ్ కింగ్స్ ఓనర్స్ లో ఒకరైన నెస్ వాడియా మాటాడారు.

ness wadia about kl rahul leaving pbks

“పంజాబ్ కింగ్స్ వదిలి కే ఎల్ రాహుల్ వెళ్ళాలి అనుకోవడం అతని ఇష్టం. కానీ మేము విడుదల చేయకముందే అతను వేరే జట్టు వాళ్ళతో చర్చ జరపడం అనైతికం” అని అన్నారు నెస్ వాడియా.  రెండు సీజన్ల పాటు పంజాబ్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించారు రాహుల్. రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ కనబర్చినా కానీ, ఆ రెండు సీజన్లలో జట్టు ఆశించిన ఆటతీరు ప్రదర్శించలేదు. ఈ సారి కూడా పంజాబ్ జట్టు రాహుల్ ని టీంలోనే పెట్టుకోవాలని భావించినా కూడా రాహుల్ అంగీకరించలేదు.

ness wadia about kl rahul leaving pbks

ఇదిలా ఉండగా, పంజాబ్ కింగ్స్ జట్టుకి అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించిన జింబాబ్వే మాజీ కెప్టెన్‌ ఆండీ ఫ్లవర్‌ కూడా తన పదవికి రాజీనామా చేసారు. రెండు సీజన్లకి ఆండీ ఫ్లవర్‌ అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించారు. కొత్త ఫ్రాంఛైజ్ లలో ఒక టీంతో అయన మళ్ళీ చేతులు కలిపే అవకాశం ఉంది అని సమాచారం.

You may also like