బాలీవుడ్ కి ఇది సిగ్గు చేటు..! కనీసం ఇది కూడా సరిగ్గా చెయ్యలేరా..?

బాలీవుడ్ కి ఇది సిగ్గు చేటు..! కనీసం ఇది కూడా సరిగ్గా చెయ్యలేరా..?

by Anudeep

Ads

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ”పఠాన్” టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్ర స్థానంలో ట్రెండ్ అవుతోంది. కింగ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకూ 18 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే 1 మిలియన్ కు పైగా లైక్స్ సాధించి బాలీవుడ్ టీజర్స్ లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.

Video Advertisement

అసలు షారుక్ సినిమా చేసి నాలుగేళ్లు దాటింది. మధ్యలో కొన్ని సినిమాలు నిర్మించాడు. కానీ అవి కూడా బెడిసి కొట్టేశాయి. ఈ విరామం తర్వాత షారుఖ్ ను ఒక స్టైలిష్ యాక్షన్ రోల్ లో చూడటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ.. ‘పఠాన్’ టీజర్ లోని వీఎఫ్ఎక్స్ పై నెట్టింట ఓ వర్గం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విజువల్స్ నాసిరకంగా ఉన్నాయని.. కొన్ని షాట్స్ లో వీఎఫ్ఎక్స్ వర్క్స్ మరీ దారుణంగా ఉన్నాయని స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు.

netizens comments on poor VFX of pathaan teaser..

ఎస్ ఎస్ రాజమౌళి లాంటి దర్శకులు వెండితెర మీద విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన తర్వాత.. సినీ ప్రియులు అదే స్థాయిలో వీఎఫ్ఎక్స్ ఉండాలని ఆశిస్తున్నారు. అసలు ఒకటిన్నర నిమిషాల టీజర్ లోనే వీఎఫ్ఎక్స్ ఇలా ఉంటే.. రెండున్నర గంటల పూర్తి సినిమాలో విజువల్స్ ఏ స్థాయిలో ఉంటాయో అని సెటైర్స్ వేస్తున్నారు.

ఇటీవలి ‘బ్రహ్మాస్త్ర: శివ’ సినిమా, ఆదిపురుష్ టీజర్ వీఎఫ్ఎక్స్ విషయంలో నెట్టింట విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వందల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ నాణ్యమైన అవుట్ ఫుట్ అందించలేకపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అవన్నీ ఎడిటింగ్ చేసిన పిక్స్ అని.. కావాలని షారుక్ ను టార్గెట్ చేయడానికి ఇలా చేస్తున్నారని కింగ్ ఖాన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

netizens comments on poor VFX of pathaan teaser..
ఏదేమైనా ఒకప్పుడు ప్రపంచ స్థాయి సినిమాలు తీస్తున్నామని గొప్పలు చెప్పుకునే బాలీవుడ్.. ఇటీవల కాలంలో సాంకేతికత పరంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఓవైపు దక్షిణాది నుంచి కంటెంట్ మరియు విజువల్ గ్రాండియర్ సినిమాలు తీస్తుంటే.. హిందీ పరిశ్రమ మాత్రం మంచి వీఎఫ్ఎక్స్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్స్ తో కూడిన చిత్రాలను అందించడంలో ఫెయిల్ అవుతోందని కామెంట్స్ వస్తున్నాయి.


End of Article

You may also like