Ads
ఐపీఎల్ 2023 లో చెన్నై జట్టు ఫైనల్ లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1 మ్యాచ్ లో టేబుల్ టాపర్ అయిన గుజరాత్ జట్టు పై గెలిచి ఫైనల్స్ కు వెళ్ళింది. కాగా, ఈ మ్యాచ్ పధిరానతో బౌలింగ్ చేయించేందుకు ధోనీ అంపైర్లతో వాగ్వాదం దిగిన విషయం తెలిసిందే.
Video Advertisement
దీని పట్ల సోషల్ మీడియాలో ధోనీ పై విమర్శలు వస్తున్నాయి. ధోనీ కావాలనే పధిరానతో బౌలింగ్ చేయించడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ధోనీ అంపైర్లతో వాగ్వాదం చేసిన ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కెప్టెన్ కూల్‌గా పేరు తెచ్చుకున్న ధోనీ, గ్రౌండ్ లో ప్రశాంతంగా కనిపిస్తూనే తన వ్యూహాలతో ముందుకెళ్తుంటాడు. ఇక అంపైర్లతో గొడవలు, క్రికెటర్స్ పై కోపం వ్యక్తం చేయడం, ఇలాంటివి ధోనీలో అరుదుగా కనిపిస్తాయి. అయితే మంగళవారం నాడు గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ధోనీ ప్రవర్తించిన విధానం పట్ల విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ధోనీ పరోక్షంగా తొండి ఆటను ఆడినట్లుగా అనిపించింది.
మంగళవారం నాటి మ్యాచ్ లో ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లలో 172/7 స్కోర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ గెలుపుకి ఆఖరి 5 ఓవర్లలో 71 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా బ్యాటింగ్ కి నలుగురు ఉన్నారు. క్రీజులో రషీద్ ఖాన్, విజయ్ శంకర్ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ధోనీ బౌలర్ మతీశ పధిరానకు బాల్ ను ఇచ్చాడు. అయితే పధిరానా మొదటి ఓవర్ వేసిన తరువాత 9 నిమిషాల పాటు గ్రౌండ్ ను వీడాడు. అతను డగౌట్ నుండి డైరెక్ట్ గా వచ్చి 16వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి రెడీ అయ్యాడు.
కానీ పధిరానా బౌలింగ్ చేయడానికి అంపైర్ ఒప్పుకోలేదు. పధిరాన గ్రౌండ్ బయట ఉన్న 9 నిమిషాలు, మళ్లీ గ్రౌండ్ లో ఉన్న అనంతరమే బౌలింగ్ చేయడానికి అంపైర్ అనుమతి ఇస్తానని తెలిపారు. దీంతో కోపం వచ్చిన ధోనీ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. బౌలర్ పధిరానకు ఇంకా 3 ఓవర్లు ఉండడంతో ఎలాగైన పధిరానతోనే బౌలింగ్ చేయించాలని ధోనీ నాలుగైదు నిమిషాల పాటు సమయాన్ని వృధా చేశాడు. అలా పధిరాన 9 నిమిషాల పాటు మైదానంలో ఉండే టైం పూర్తయింది. అప్పుడు అంపైర్ ఒప్పుకోక తప్పలేదు.
అలా ధోనీ ఉద్దేశపూర్వకంగానే 4 నిమిషాలు మ్యాచ్ ఆపి, తాను అనుకున్నట్టుగానే బౌలింగ్ వేయించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ధోనీని విమర్శిస్తున్నారు. ఇక ధోనీ ప్లేస్ లో వేరే వారు కెప్టెన్ గా ఉంటే అంపైర్లు ఇలా జరగనిచ్చేవారా అని అడుగుతున్నారు. ధోనీ వ్యవహారించిన విధానం సరిగా లేదని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు పై గెలిచి చెన్నై జట్టు ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
Pathirana was out of the field for more than 9 minutes and came suddenly to bowl. Here the rule is that Pathirana should present atleast 9 minutes on the field to bowl his over but what Dhoni was chatting with umpires??
This isn't acceptable at all. pic.twitter.com/NML3LikBc3— Priyansh (@priyansh_45) May 23, 2023
Also Read: CSK VS GT : ఈ 3 కారణాల వల్లే… “గుజరాత్ టైటాన్స్” ఓడిపోయిందా..?
End of Article