RCB కప్ గెలిచినా కోహ్లికి కష్టమే అనుకుంటా.? ఈ యాంగిల్ లో ఒక్కసారి చూడండి.!

RCB కప్ గెలిచినా కోహ్లికి కష్టమే అనుకుంటా.? ఈ యాంగిల్ లో ఒక్కసారి చూడండి.!

by Sunku Sravan

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ చెత్త పెర్ఫార్మెన్స్ తో అందరిచేత విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్ లో మాత్రం కోహ్లీ పరుగుల కోసం చాలా కష్టాలు పడుతున్నారు. ఐపీఎల్ తొలినాళ్ళలో 2008 కేవలం 165 పరుగులు మాత్రమే చేసినటువంటి కోహ్లీ..

Video Advertisement

2009 లో 246 పరుగులు చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన ప్రతి సీజన్ లో 300పైగా పరుగులు చేస్తూ వస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ కు ముందు 2022 సీజన్లో కోహ్లీ మాత్రం13 మ్యాచ్ లు ఆడితే కేవలం 236 పరుగులు చేశారు.

దీంతో ఈ సీజన్ లో చెత్త రికార్డులు మూటకట్టుకోవడం ఖాయం అనుకుంటున్న వేళ తన సత్తాను చాటాడు. గుజరాత్ టైటన్స్ తో గురువారం జరిగినటువంటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73) చెలరేగి పోయాడు. ప్లే అప్స్ కీ వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో మాత్రం విరాట్ మరోసారి కింగులా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తో విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరున వేసుకున్నాడు.

15 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఎక్కువగా ప్రతి సీజన్ లో మూడు వందలకు పైగా పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా విరాట్ నిలిచాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా సాధించాడు. విరాట్ ఇలాంటి రికార్డు సాధించడం పదమూడో సారి. ఈ విక్టరీ తో బెంగళూరు ప్లే ఆప్ అవకాశాలను సజీవంగా ఉంచారు.

అయితే ముంబై మరియు ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై గెలవడంతో ఆర్ సిబి ప్లే అప్స్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.. అయితే ఈ సారి RCB కప్ కొట్టినా విరాట్ కోహ్లీ కి కష్టాలు తప్పవు అనుకుంట. ఐపీఎల్ చరిత్రలోనే 15 సీజన్లు ఒకే ప్రాంచైజీ తరఫున ఆడిన ఆటగాడు విరాట్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఎంట్రీ ఇచ్చినటువంటి విరాట్, 15 సీజన్ల నుండి అదే టీం తరఫున తన ఆటను కొనసాగిస్తున్నాడు.

ఇందులో తొమ్మిది సీజన్లు కెప్టెన్ గా చేసి, 2016లో ఫైనల్ కు చేరారు కానీ టైటిల్ గెలవలేదు. అయితే ఐపీఎల్ 2021 కూడా సీజన్ కు ముందు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఇదే నా ఆఖరి సీజన్ అంటూ ప్రకటన చేశారు. అన్నట్టుగానే ఈ సీజన్లో సాధారణ ప్లేయర్గా బరిలో ఉన్నాడు. డూప్లిసెస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సారి RCB ప్లే ఆఫ్స్ లో పెద్దగా అనుభవం లేనటువంటి సంజు శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ జట్టు, రాహుల్ కెప్టెన్సీలోని లక్నో జట్టు, పాండ్య కెప్టెన్సీలోని గుజరాత్  తో  ఫైనల్ టైటిల్ కోసం పోరాటం చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్సీ గా చేసిన డూప్లిసెస్ కుర్రాళ్లను ఓడించి టైటిల్ సాధిస్తే మాత్రం ఆర్ సి బి పదిహేను సీజన్ల కళ తీరినట్టే అవుతుంది.

కానీ విరాట్ కోహ్లీ మాత్రం విమర్శల పాలు కావడం తప్పదు. ఆయన కెప్టెన్సీ తప్పుకోగానే ఆర్సిబి టైటిల్ గెలిచిందని తప్పకుండా విమర్శలు వస్తాయి. కోహ్లీ కెప్టెన్సీ వల్లనే ఇన్ని రోజుల నుంచి టైటిల్ గెలవలేదని ట్రోల్స్ రావడం పక్కా అంటున్నారు కొంతమంది. ఒకవేళ ఓడిపోయినా విరాట్ కోహ్లీ సరిగా ఆడనందుకే ఓడిపోయింది అని కూడా విమర్శలు వస్తాయి. దీంతో కోహ్లీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారిందని చెప్పవచ్చు.


You may also like