క్రికెట్ లో ఇక నుండి కొత్త రూల్… టి20 లో అమలు చేయనున్న ఐసిసి

క్రికెట్ లో ఇక నుండి కొత్త రూల్… టి20 లో అమలు చేయనున్న ఐసిసి

by Mounika Singaluri

Ads

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు క్రికెట్ లో కొత్త నిబంధనలు తీసుకొస్తు పరిమిత ఓవర్ల క్రికెట్ కి ఉన్న ఆదరణను కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త రూల్ ను టి20 లో ప్రవేశపెట్టనుంది.డిసెంబర్‌ 12 నుంచి పొట్టి ఫార్మాట్‌లో కొత్త రూల్‌ను అమల్లోకి తేనుంది.

Video Advertisement

విండీస్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ లో ఐసీసీ స్టాప్‌ క్లాక్‌ అనే నిబంధనను ఆచరణలోకి పెట్టనుంది.ఈ నిబంధన వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. స్టాప్‌ క్లాక్‌ రూల్‌ మెన్స్ వన్డే, టీ20 ఫార్మాట్లలో అమల్లో ఉంటుంది.

ఓవర్ కి ఓవర్ కి మధ్య సమయం వృధా అవ్వకుండా ఐసీసీ ఈ స్టాప్ క్లాక్ రూల్ ను తీసుకువచ్చింది. బౌలింగ్ వేసే జుట్టు ఒక ఓవర్ పూర్తయిన తర్వాత మళ్లీ 60 సెకండ్లు లోపు తర్వాత ఓవర్ మొదలుపెట్టాలి. రెండుసార్లు ఈ 60 సెకండ్లకు గడువు దాటితే మూడోసారి బ్యాటింగ్ చేసే టీం కి 5 పరుగులను యాడ్ చేస్తారు. దీనివల్ల ఈ t20 ఫార్మేట్ లో మరింత వేగం పెరుగుతుందని ఐసీసీ భావిస్తుంది.ఫీల్డ్‌ అంపైర్లు స్టాప్‌ క్లాక్‌తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. నవంబర్‌ 21న అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో స్టాప్‌ క్లాక్‌ నిబంధన అమలుపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది.


End of Article

You may also like