Ads
ఇండియన్ ప్రీమియర్ లీగ్, అంటే ఐపీఎల్ 2024 ఇవాళ సాయంత్రం నుండి మొదలవుతుంది. దీని కోసం ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ఎంతో మంది సెలబ్రిటీలు మ్యాచ్ కి ముందు జరిగే వేడుకలో పాల్గొంటున్నారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్ గా చేయాలి అని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లో కొన్ని కొత్త నిబంధనలు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 బౌన్సర్ రూల్
ఈసారి ఒకటే ఓవర్ లో 2 బౌన్సర్లు విసిరే రూల్ అమలులోకి తీసుకొచ్చారు. గత సీజన్లలో అయితే ఒక ఓవర్ లో ఒక బౌన్సర్ మాత్రమే విసరడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం దీన్ని మార్చారు. ఈ నిబంధన వల్ల బౌలర్లకి లాభం జరుగుతుంది. సాధారణంగా అయితే, గతంలో రెండవ బౌన్సర్ ని నో బాల్ కిందకి తీసుకునేవారు. కానీ ఈసారి 6 బంతుల్లో 2 బౌన్సర్లు ఉంటాయి. దాంతో బౌలర్లు అక్కడ ఉన్న పరిస్థితిని పరిగణించి బౌన్సర్లని ఉపయోగించే అవకాశం ఉంటుంది.
#2 స్మార్ట్ రిప్లై సిస్టం
డెసిషన్ రివ్యూ సిస్టం తీసేసి ఈసారి స్మార్ట్ రిప్లై సిస్టం ని పెట్టారు. ఫీల్డ్ మొత్తంలో 8 హాక్-ఐ కెమెరాలని ఏర్పాటు చేసి, దాని ద్వారా అక్కడ జరుగుతున్న దృశ్యాలని చిత్రీకరిస్తారు. దీని ద్వారా వివిధ యాంగిల్స్ లో రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా హాక్-ఐ ఆపరేటర్లు స్ప్లిట్ స్క్రీన్ వాడతారు. వివిధ కోణాల నుండి వీటి ద్వారా ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ ఫీల్డర్ బౌండరీ లైన్ లో క్యాచ్ పట్టుకుంటే, ఫీల్డర్ కాలు బౌండరీ లైన్ కి తగిలిందా? ఒకవేళ తగిలితే పాదంలో ఏ భాగం తగిలింది? అనే విషయాన్ని కూడా థర్డ్ అంపైర్, స్ప్లిట్ స్క్రీన్స్ ని ఉపయోగించి ఇంకా పరిశీలనతో ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. థర్డ్ అంపైర్ వీటి సహాయంతో నిర్ణయాన్ని వెంటనే ప్రకటిస్తారు.
#3. నో స్టాప్ క్లాక్
అయితే, ఈసారి ఐసీసీ మరొక నిబంధన కూడా తీసుకొచ్చింది. దాని పేరు నో స్టాప్ క్లాక్. కానీ ఈ నిబంధనని అమలు చేయట్లేదు. ఈ నిబంధన చూసుకుంటే, ఒకవేళ ఓవర్ పూర్తయితే, థర్డ్ అంపైర్ టైమర్ మొదలు పెడతారు. 60 సెకండ్లు ముగిసేలోపు బౌలింగ్ జట్టు ఇంకొక ఓవర్ మొదలు పెట్టాలి. ఒకవేళ లేదు అంటే 2 సార్లు హెచ్చరిస్తారు. అయినా సరే ఇచ్చిన సమయంలోపు ఓవర్ వేయకపోతే 5 పరుగుల పెనాల్టీ పడుతుంది. ఈసారి అయితే ఐపీఎల్ లో ఈ రూల్ అమలు చేయట్లేదు. కానీ టీ20 వరల్డ్ కప్ సమయానికి ఈ రూల్ అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ సీజన్ కోసం పైన చెప్పిన 2 నిబంధనలు మాత్రం కచ్చితంగా అమలులోకి తీసుకొచ్చారు.
ALSO READ : IPL 2024 : జడేజాని కాదని రుతురాజ్‌కి కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారు? 2022లో అలా జరిగినందుకేనా?
End of Article