టీం ఇండియా మీద ఇంత కుళ్ళా.? ఓడిస్తే డేటింగ్ అంటూ బంగ్లా ప్లేయర్స్ కి ఆఫర్ ఇచ్చిన పాక్ నటి.!

టీం ఇండియా మీద ఇంత కుళ్ళా.? ఓడిస్తే డేటింగ్ అంటూ బంగ్లా ప్లేయర్స్ కి ఆఫర్ ఇచ్చిన పాక్ నటి.!

by Harika

Ads

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో టీమిండియా తన జోరు కనబరుస్తూ ముందుకు దూసుకు వెళ్తుంది. మొదట మ్యాచ్ లో కాస్త తడబడ్డ కెప్టెన్ కూడా ఆ తరువాత విజృంభించి ఆడుతున్నాడు.

Video Advertisement

హ్యాట్రిక్ విజయాలతో రోహిత్ సేన పూర్తి పాజిటివ్ వైబ్స్ తో ఉంది. ఈ నేపథ్యంలో మొన్న శనివారం జరిగిన మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది టీం ఇండియా. రోహిత్ తన బ్యాటుతో వీర విహారం చేస్తే.. ఆ దాటికి పాక్ ప్లేయర్లు బెంబేలెత్తారు.

ఇండియా ,పాక్ మ్యాచ్ లపై అభిమానులకు ఎన్ని ఆశలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గెలిస్తే ఎంత ఆకాశానికి ఎత్తేస్తారు పొరపాటున ఓడిపోతే అంత తిట్టిపోస్తారు. పాపం పాత విషయంలో కూడా ఇదే జరుగుతుంది. టీమిండియా చేతిలో ఓడిపోయిన అప్పటినుంచి పాక్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్స్ ,కోచింగ్ స్టాఫ్ టీం ఇండియా, బీసీసీ ను పూర్తిగా టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళ జాబితాలో పాకిస్తాన్ హీరోయిన్ సెహర్ షిన్వారీ యాడ్ అయ్యింది.

pakistan heroine tweet on team india

క్రికెట్ కి ఆ హీరోయిన్ కి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? ఏం లేదండి పాపం లేటెస్ట్ గా ఈ బ్యూటీ చేసిన ఒక చిన్న ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం ఏమిటంటే తమ జట్టును ఓడించిన టీం ఇండియా ను బంగ్లాదేశ్ జట్టు ఓడిస్తే.. కాస్త సాటిస్ఫై అవ్వచ్చు అనేది పాక్ ఉద్దేశం. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ లో భారత్ ను ఓడించగలిగిన బంగ్లాదేశ్ క్రికెటర్ తో డేటింగ్ కు వెళ్తానంటూ ఈ బ్యూటీ హామీ ఇచ్చింది.

pakistan heroine tweet on team india

“భగవంతుడా.. బంగ్లాదేశ్ టీమిండియాను ఓడిస్తే నేను దాకా కు వెళ్లి ఆ బంగ్లాదేశ్ క్రికెటర్ తో డిన్నర్ డేట్ కి వెళ్తాను”అంటూ ఆమె పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఇలా విచిత్రమైన పోస్టులు పెట్టడం సెహర్ షిన్వారి కొత్త కాదు. ఇంతకుముందు కూడా ఆసియా కప్ లో సూపర్ మ్యాచ్లో భారత్ తో పాక్ ఓడిపోతే కెప్టెన్ బాబర్ అజామ్‌, ఆతని జట్టు సభ్యులపై కేసు పెడతానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

pakistan heroine tweet on team india

అయితే ఏమి పెట్టిన బోల్డ్ కామెంట్ ప్రస్తుత ఆమెను వివాదం లోకి నెట్టింది. భారత్ ను ఓడించడం పాకిస్తాన్ వల్లే కాలేదు మరి అలాంటిది బంగ్లాదేశ్ వల్ల అవుతుందా. పగటి కలలు కనకు అంటూ ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు టీమిండియా పై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఏదో ఒక రకంగా తన ద్వేషాన్ని వెళ్ళగక్కే ఈ సెహర్ షిన్వారి ఈసారి పాపం తన ట్రాప్ లో తానే ఇరుకుంది.

ALSO READ : కొడుకును చూసి ఎమోషనల్ అయిన శిఖర్ ధావన్..! వీడియో కాల్ లో మాట్లాడుతూ..?


End of Article

You may also like