Ads
2023 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో పాకిస్తాన్ ప్రదర్శన చూసిన ఎవ్వరికైనా సరే బిల్డప్ ఎక్కువ…మేటర్ తక్కువ అనిపించక మానదు…ఈ వరల్డ్ కప్ ఆరంభానికి ముందు పాకిస్తాన్ మాటలు విన్న ఎవరైనా ఆ మాటలకి, ఇప్పుడు మీరు చేసే దానికి ఏమైనా పోలిక ఉందా అంటూ కామెంట్ చేయకమానరు. భారత్ కి మేమే పోటీ, మాకు మేమే పోటీ అంటూ పాకిస్తాన్ ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు సైతం కామెంట్లు చేశారు.
Video Advertisement
తీరా నాకౌట్ మ్యాచ్ లో భారత్-పాకిస్తాన్ ఢీకొన్న సందర్భంలో వార్ వన్ సైడ్ అయిపోయింది. పాకిస్తాన్ ని భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. తర్వాత పిల్ల కూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కూడా పాకిస్తాన్ ఓటమి చెందింది. ఆడిన ప్రతి మ్యాచ్ లోను తన చెత్త ప్రదర్శనతో ఓటమిపాలు చెందుతుంది.
పాకిస్తాన్ ఫీల్డింగ్ అంటే నవ్వుల పాలు అవడం మామూలే. ఈ వరల్డ్ కప్ లో కూడా అది రిపీట్ అయింది. సెమీస్ కి చేరాలని విశ్వ ప్రయత్నాలు చేసిన పాకిస్తాన్ ఇంటి బాట పట్టింది. తమ వల్ల కాదు అని ఒప్పుకోకుండా భారత్ ఆటగాళ్ల పట్ల తమకక్షపూరిత ధోరణి ఎప్పటికప్పుడు వ్యవహరిస్తూనే ఉంది. పాకిస్తాన్ మాజీ ఆటగాల్లు అయితే విరాట్ కోహ్లీ పై ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు.తాజాగా 2023 ప్రపంచ కప్ టోర్నీ నుండి పాకిస్తాన్ వైదొలిగింది. 2003 నుండి చూసుకుంటే పాకిస్తాన్ సెమీస్ కి అర్హత సాధించడం లేదు. వరుస పెట్టి 2007, 2015,2019 ఇప్పుడు 2023 ఇలా అన్నిటిలోనూ సెమిస్ కి చేరకుండానే ఇంటి బాట పట్టింది. 2011 లో మాత్రమే ఇండియాతో సెమీస్ లో పోరాడి ఓడిపోయింది పాక్.
2003 world cup points table:
2007 world cup points table:
2015 world cup points table:
2019 world cup points table:
2023 world cup points table:
ఈ ఘనంకాలు చూసిన క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. బిల్డప్ ఎక్కువ మేటర్ తక్కువ అంటే కామెంట్లు పెడుతున్నారు. భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అయితే బాయ్ బాయ్ పాకిస్తాన్ అంటూ పోస్ట్ పెట్టాడు. తమ ఆట తీరితో సమాధానం చెప్పేలా ఉండాలి గానీ నోటితోను, తమ ప్రవర్తన తో కాదు అని పాకిస్తాన్ ఆటగాళ్లు ఇకనైనా తెలుసుకోవాలని హితబోధ చేస్తున్నారు.పాకిస్తాన్ తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ మంచి ప్రదర్శన కనబరిచింది.
Also Read:వరల్డ్ కప్ గెలిచేందుకు రోహిత్ వ్యూహం ఇదే అంట…సెమీస్ లో “న్యూజిలాండ్” పై.?
End of Article