RRR కలెక్షన్స్ ని… బీట్ చేసిన ఆ “పాకిస్తాన్ సినిమా” ఎదో తెలుసా..?

RRR కలెక్షన్స్ ని… బీట్ చేసిన ఆ “పాకిస్తాన్ సినిమా” ఎదో తెలుసా..?

by Anudeep

Ads

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టిస్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ సృష్టించిన ప్రభంజనం ని ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆ అంచనాలను మించి సునామి ని సృష్టించింది..కేవలం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే కాదు..ప్రపంచ స్థాయి బాక్స్ ఆఫీస్ ని శాసించింది ఈ చిత్రం.

Video Advertisement

అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ ని ఇక్కడ ఒక పాకిస్తానీ సినిమా దాటేసింది..ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారిన అంశం. పాకిస్తాన్ లో ఇటీవలే ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ అనే చిత్రం విడుదలై అక్కడ ప్రభంజనం సృష్టించింది..ఆ సినిమా కేవలం పాకిస్తాన్ లో మాత్రమే కాదు..ఓవర్సీస్ లో కూడా దుమ్ములేపేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా లండన్ లో ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ ని దాటేసిందట..ఫుల్ రన్ లో ఈ చిత్రం 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

pakisthani movie beats RRR collections in UK
పాకిస్థానీలకు దేనిలోనైనా భారత్‌తోనే పోటీ. మన మీద పైచేయి సాధించడమంటే వాళ్లకు ఎంత సరదానో.. మన మీద దుమ్మెత్తిపోయడమన్నా అంతే కసి.  ఫవద్ ఖాన్, మహిరా ఖాన్ ప్రధాన పాత్రల్లో ‘ది లెజెండ్స్ ఆఫ్ మౌలా జట్’ అనే సినిమా పాకిస్థాన్‌లో రూపొందించారు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది.

pakisthani movie beats RRR collections in UK

అయితే, ఈ సినిమా యూకేలో ఆర్ ఆర్ ఆర్ లైఫ్‌టైమ్ బాక్సాఫీస్ రెవెన్యూను 17 రోజుల్లో రాబట్టిందని నిర్మాతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. పాకిస్థానీ ఫిలిం మేకర్స్.. రెవెన్యూ నంబర్స్ మాత్రం పేర్కొనలేదు. అయితే, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ యూకేలో రూ.100 కోట్ల మేర వసూలు చేసింది. పాకిస్థానీ మూవీ 17 రోజుల్లో రూ.150 కోట్లు రాబట్టిందట.

pakisthani movie beats RRR collections in UK
ఆ సినిమా ఆర్ ఆర్ ఆర్ ను బీట్ చేసి ఉండొచ్చు.. కానీ, ఇలా బహిరంగంగా ఆర్ ఆర్ ఆర్ కన్నా మా సినిమా గొప్ప అని ప్రకటించుకోవడం విమర్శలకు దారి తీసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఇతర దేశాలలో కూడా అద్భుతమైన ఆదరణ లభించిందని..ఆ స్థాయి వసూళ్లను అందుకోవడం ఎవరి తరం కాదని ఈ సందర్భం గా అభిమానులు చెప్తున్నారు..ఇటీవలే ఈ చిత్రాన్ని జపాన్ లో విడుదల చెయ్యగా అక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది..ఈ చిత్రం ఇక్కడ కేవలం పది రోజుల్లోనే 200 జపనీస్ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.


End of Article

You may also like