కూతురికి గుణపాఠం చెప్పాలని ఈ తల్లిదండ్రులు చేసిన పని చూస్తే…షాక్ అవుతారు.!

కూతురికి గుణపాఠం చెప్పాలని ఈ తల్లిదండ్రులు చేసిన పని చూస్తే…షాక్ అవుతారు.!

by Mohana Priya

Ads

సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు ఎపుడైనా అల్లరి చేస్తే వారిని కంట్రోల్ చేయడానికి కొట్టడం కానీ, తిట్టడం కానీ, లేదా ఏదైనా పనిష్మెంట్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ పిల్లలని దారిలోకి తేవడానికి మార్గాలు. కానీ ఇటీవల ఒక జంట మాత్రం తమ కూతురిని దారిలోకి తేవడానికి, తన అల్లరిని తగ్గించడానికి ఒక విచిత్రమైన పని చేసి చర్చల్లో నిలిచింది.

Video Advertisement

వివరాల్లోకి వెళితే, చైనాలోని షాన్డాంగ్ ప్రావీన్స్ సముద్రం దగ్గరలో ఒక 13 ఏళ్ల అమ్మాయిని తన తల్లిదండ్రులు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి అక్కడ కరెంట్ లేకుండా చీకటిలోనే దాదాపు రెండు రోజులపాటు గడిపింది. అయితే ఒక రోజు అక్కడ సముద్ర జలాల్లో వేటకు వెళ్లిన జాలరులకి ఆ అమ్మాయి కనిపించింది.

“ఇక్కడికి ఎలా వచ్చావు?” అని ఆ అమ్మాయిని ప్రశ్నించగా. అందుకు ఆ అమ్మాయి “తాను స్కూల్ కి వెళ్లడం మానేసిన కారణంగా తన తల్లిదండ్రి తీసుకువచ్చి, తనని అక్కడ వదిలేసి వెళ్లారు” అని చెప్పింది. దీంతో ఆ జాలరులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆమె చిరునామా తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులను కూడా బోట్ లో ఆ సముద్ర తీరానికి తీసుకువచ్చారు.

Parents dumped their daughter in deserted island

పోలీసులు ఆ తల్లిదండ్రులతో వెంటనే తమ కూతురిని ఇంటికి తీసుకు వెళ్ళాలి అని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. దాంతో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని అయిష్టంగానే ఇంటికి తీసుకువెళ్లడానికి అంగీకరించారు. తమ కూతురుకి తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే ఆ తల్లిదండ్రులు ఇలా చేసినట్లు చెప్పారు.

watch video :

https://youtu.be/kV_vvE6v59Y


End of Article

You may also like