న్యూజిలాండ్ బ్యాటర్ ఫిలిప్స్ రన్ అవుట్ ఎందుకు ఇవ్వలేదు? క్రీజ్ లోకి రాలేదుగా…!!!

న్యూజిలాండ్ బ్యాటర్ ఫిలిప్స్ రన్ అవుట్ ఎందుకు ఇవ్వలేదు? క్రీజ్ లోకి రాలేదుగా…!!!

by kavitha

Ads

ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య వాఖండేలో జరిగిన సెమీఫైనల్ అభిమానులలో హుషారు పెంచింది.

Video Advertisement

బ్యాట్సమెన్ ల పరుగులు హోరు,బౌలర్ల వికెట్ల జోరు ఇండియా ని ఫైనల్ లోకి దూసుకువెళ్లేలా చేసింది.కాగా 43 వ ఓవర్లో జరిగిన ఘటన ప్రేక్షకులను కాస్త గందరగోళానికి గురు చేసింది.

హోరాహోరీగ జరుగుతున్నసెమీ ఫైనల్ లో 43 వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రాహ్ బౌలింగ్ కి వచ్చాడు. కాగా రన్ అవుట్ కి అవకాశం దొరికితే బుమ్రాహ్ అవుట్ చేసిన నాట్ అవుట్ అన్నారు అంపైర్లు .దీనితో గందరగోళ పరిస్థితి నెలకొంది. బుమ్రా ఓ అద్భుతమైన త్రోతో కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ క్రీజులోకి రాకముందే వికెట్లను గిరాటేశాడు. జస్ప్రీత్ బుమ్రా విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకింది. అప్పటికి ఫిలిప్స్ ఇంకా క్రీజులోకి చేరుకోలేదు. కానీ అంపైర్ ఔట్ కింద ప్రకటించలేదు. దీని వెనుక అసలు కారణం వేరే ఉంది.

బుమ్రా వేసిన ఫుల్‌టాస్‌ను ఆడిన మిచెల్ మొదటి పరుగు పూర్తిచేశాడు. అయితే ఫీల్డింగ్ చేస్తూ బంతిని ఆపిన రవీంద్ర జడేజా.మిచెల్‌ను రనౌట్ చేయాలనే ఉద్దేశంతో నాన్ స్ట్రైకర్ వైపు ఉన్న వికెట్లను పడకొట్టారు. అయితే వికెట్లను తాకిన బంతి పక్కకు దూసుకెళ్లింది. అయితే అప్పటికే తొలి పరుగు పూర్తిచేసిన మిచెల్. రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ సమయంలో బంతిని అందుకున్న జస్ప్రీత్ బుమ్రా. బౌలర్ వైపున ఉన్న వికెట్లను గిరాటేశాడు. అప్పటికి కివీస్ బ్యాటర్ ఫిలిప్స్ క్రీజులోకి చేరుకోలేదు. కానీ అంపైర్ అతన్ని నాటౌట్‌గా ప్రకటించారు.దీనికి గల కారణం ICC నిబంధనలు.

ICC నిబంధనల ప్రకారం రెండు బైల్స్ కింద పడితే,ఆ సమయంలో రన్ అవుట్ చేయాల్సి వస్తే బాల్ ఒక చేతో పట్టుకొని ఇంకో చేతో ఒక వికెట్ ని లాగేయాల్సి ఉంటుంది.ఈ సెమి ఫైనల్ మ్యాచ్ లో బుమ్రా రనౌట్ చేసేటప్పటికే వికెట్ మీద ఉన్న బెయిల్స్ కిందపడిపోయాయి. జడేజా విసిరిన త్రోకు రెండు బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో బుమ్రా మరోసారి వికెట్లను పడగొట్టినా ఫలితం లేకపోయింది.అందువల్లే ఫిలిప్స్ రన్ అవుట్ ఇవ్వలేదు.బుమ్రాహ్ కనుక బాల్ చేతిలో ఉంచుకొని వికెట్ లాగి ఉంటె ఫిలిప్స్ అవుట్ అయ్యి ఉండేవాడు.

ALSO READ:-సెంచరీ చేశాక బ్యాట్స్‌మెన్ తన బ్యాట్ ని ఎందుకు పైకి ఎత్తుతాడు..? కారణం ఏంటంటే..?


End of Article

You may also like