Ads
వన్డే వరల్డ్ కప్ భారత్లో చివరిగా జరిగినప్పుడు, మన ఇండియన్ టీం అద్భుతమైన ప్రదర్శనతో ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ పర్ఫామెన్స్ ఎవరూ మర్చిపోలేరు. రక్తం కక్కుతూ కూడా అతను దేశం కోసం ఆడాడు.
Video Advertisement
అందుకే 2011 సంవత్సరం వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ పర్ఫామెన్స్ ఎవరు మర్చిపోలేము. అయితే ప్రస్తుతం భారత జట్టులో అలాంటి ప్లేయర్ లేడు.
ఈ నేపథ్యంలో ఈసారి యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఈ చర్చకు మాజీ సెలెక్టర్, టీమిండియా లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంత్ బదులిచ్చాడు. జట్టులో యువీ వంటి ఆల్‌రౌండర్లు చాలా కీలకం అని నొక్కి చెప్పిన శ్రీకాంత్.. ముఖ్యంగా భారత్‌లో పిచ్‌ల గురించి కూడా తన అభిప్రాయం చెప్పాడు. అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన 2011 వరల్డ్ కప్ టీం గురించి కూడా ప్రస్తావించాడు.
‘భారత్‌లో కొన్ని వికెట్లు బాగా టర్న్ ఇస్తాయి. ఆస్ట్రేలియాలో ఉన్నంత బౌన్స్ ఇక్కడ ఉండదు. ఇంగ్లండ్‌లో దొరికే మూవ్‌మెంట్ కూడా ఉండదు. ఈ పరిస్థితులకు భారత జట్టు అలవాటు పడిపోయింది. అదే ఈ జట్టుకు పెద్ద అడ్వాంటేజ్. 2011 వరల్డ్ కప్‌లో చాలా మంది ఆల్‌రౌండర్లను చూశాం. ధోనీ సమర్ధవంతమైన నాయకత్వంలో అద్భుతమైన టీం ఆడింది’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
‘ఆ సమయంలో మనకు యువరాజ్ సింగ్ ఉన్నాడు. ఇప్పుడు ఆ పాత్రను రవీంద్ర జడేజా ఫుల్‌ఫిల్ చేస్తాడని అనుకుంటున్నా. 2011లో యువరాజ్ చేసిన ప్రదర్శననే జడేజా చేస్తాడని నా నమ్మకం. ఈసారి భారత్ కనుక వరల్డ్ కప్ గెలవాలంటే.. జడేజా, అక్షర్ పటేల్ వంటి వాళ్లే చాలా కీలకం అని గట్టిగా నమ్ముతున్నా’ అని తెలియజేశారు శ్రీకాంత్. మరి ఈ ఇద్దరు ప్లేయర్స్ ని రోహిత్ ఎలా ఉపయోగించుకుంటారు అనేది మెయిన్ పాయింట్.
ALSO READ : వరల్డ్‌కప్ 2011 ఫైనల్ లో “ధోని నిర్ణయం వెనుక ఉన్న మిస్టరీ అదే” అని.. “మురళీధరన్” కామెంట్స్..!
End of Article