Ads
ఒకపక్క భారతదేశంలో ఐపీఎల్ సందడి జరుగుతోంది. మరొక పక్క ఇంగ్లాండ్ లో కౌంటీ ఛాంపియన్‌షిప్ కూడా మొదలైంది. ప్రపంచంలోనే చాలా మంది స్టార్ క్రికెటర్లు ఇందులో పాల్గొంటున్నారు. టీం ఇండియా నుండి చెతేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్ ఆడుతున్నారు. వీరిలో కరుణ్ నాయర్ నార్తాంప్టన్‌షైర్‌లో ఆడుతున్నారు. ఏప్రిల్ 21వ తేదీన జరిగిన మ్యాచ్ లో గ్లామోర్గాన్‌పై కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ చేశారు. ఇందులో 253 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 202 పరుగులు స్కోర్ చేశారు. 2016 లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అజేయంగా 303 పరుగులు స్కోర్ చేయడంతో కరుణ్ నాయర్ వెలుగులోకి వచ్చారు.
Video Advertisement
వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు ఎలైట్ క్లబ్‌లో టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండవ భారతీయుడుగా కూడా రికార్డ్ సాధించారు. 2013 నుండి 2015 వరకు దేశీయ క్రికెట్‌లో కర్ణాటక తరపున ఆడి, ఆ సమయంలో తన ఆట తీరు వల్ల పేరు తెచ్చుకున్నారు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులో మొదటిగా ఆడారు. ఆ తర్వాత అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అయిన ఇప్పటి ఢిల్లీ కాపిటల్స్ జట్టుకి కూడా ప్రాతినిధ్యం వహించారు. 2016 లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ లో 83 పరుగులు స్కోర్ తో నాటౌట్ గా నిలవడంతో జింబాబ్వే లిమిటెడ్ ఓవర్స్ టూర్ కి వెళ్లే టీం ఇండియా జట్టుకి కూడా కరుణ్ నాయర్ ఎంపికయ్యారు.
2018 లో అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అయిన ఇప్పటి పంజాబ్ కింగ్స్ జట్టులో కూడా ఎంపిక అయ్యారు. ఇందులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి వ్యతిరేకంగా హాఫ్ సెంచరీ కూడా చేశారు. 2021 సీజన్‌కు ముందు, కరుణ్ నాయర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తీసుకుంది. 2022 లో చివరిసారిగా ఐపీఎల్ ఆడే అవకాశం దొరికినా కూడా ఆడలేకపోయారు. 2023 లో కరుణ్ నాయర్ ని ఎవరు తీసుకోలేదు. కేఎల్ రాహుల్ కి దెబ్బ తగిలినప్పుడు లక్నో సూపర్ జెంట్స్ జట్టు కరుణ్ నాయర్ ని తీసుకున్నారు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీలు చేశారు. దాంతో, ఐపీఎల్ లో ఆరు జట్లు వద్దు అన్న ప్లేయర్ ఇప్పుడు ఇంత బాగా ఆడుతున్నారు అంటూ అందరూ పొగుడుతున్నారు.
ALSO READ : ఈ ప్రోగ్రాంలో వచ్చిన అమ్మాయి ఇప్పుడు తెలంగాణ గర్వించే స్థాయికి చేరుకుంది..! ఎవరో గుర్తుపట్టారా..?
End of Article