Ads
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత, టీ20 కెప్టెన్‌గా టీమిండియా బాధ్యతలు చేపట్టారు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఈ స్థానానికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నారు. ఒక స్టార్ క్రికెటర్ అవ్వాలి అనే క్రమంలో తన తోటి ప్లేయర్లను కూడా ఇబ్బందుల్లోకి నెట్టాల్సి వస్తుంది.
Video Advertisement
ధోని వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సెటిల్ అవ్వడంతో, ఆ స్థానంలో పార్థివ్ పటేల్, నామన్ ఓజా, దినేశ్ కార్తీక్, వృద్ధిమాన్ సాహా పోటీ పడ్డారు. కానీ వారికి తగిన అవకాశాలు రాలేదు. అలాగే రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా మారి, నిలకడైన పర్ఫామెన్స్ ఇవ్వడంతో మరొక సీనియర్ బ్యాట్స్‌మెన్, ఓపెనర్ అయిన మురళీ విజయ్ కెరియర్ అర్థాంతరంగా ఆగిపోయింది. 2008 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ షేన్ వాట్సన్ ని ఉద్దేశపూర్వకంగా మోచేతి తోయడంతో ఒక మ్యాచ్ లో నిషేధానికి గురయ్యారు.
దాంతో గౌతమ్ గంభీర్ స్థానంలో నాగ్‌పూర్‌లో జరిగిన నాలుగవ టెస్టులో ఆస్ట్రేలియాపై టెస్ట్ ఎంట్రీ ఇచ్చారు మురళీ విజయ్. గంభీర్ మీద బ్యాన్ పడడంతో, రంజీ ట్రోఫీలో ఆడుతున్న మురళీ విజయ్ ని అర్థాంతరంగా టీమిండియాలో పిలిపించారు సెలెక్టర్లు. మొదటి మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ తో కలిసి ఓపెనింగ్ చేసిన మురళి విజయ్, 41 బంతుల్లో 33 పరుగులు చేసి, తొలి వికెట్‌కి 116 బంతుల్లో 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీమ్ ఇండియా తరఫున 61 టెస్టులు ఆడిన మురళీ విజయ్, 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలతో 38.29 సగటుతో 3982 పరుగులు చేశారు.
17 వన్డే మ్యాచ్ లలో ఒక హాఫ్ సెంచరీతో 339 పరుగులు చేశారు. 2018లో డిసెంబర్ లో సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆడిన మురళీ విజయ్, 2019లో రోహిత్ శర్మ టెస్ట్ ఓపెనర్‌గా ఎంట్రీ ఇవ్వడంతో టీమ్ ఇండియాకి దూరం అయ్యారు. టెస్టుల్లో ఓపెనర్‌గా ఎంట్రీ రోహిత్ శర్మ, తన సత్తా చాటి తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ చేశారు. రోహిత్ శర్మ టెస్ట్ ఓపెనర్‌గా సెటిల్ అవ్వగా, రోహిత్ శర్మకి తోడుగా మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు మరో ఎండ్ ఓపెనర్లుగా ఉన్నారు.
టెస్ట్ ఓపెనర్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ, మురళీ విజయ్ కెరీర్ అర్ధాంతరంగా ముగియడానికి కారణం అయ్యింది అని చెప్పవచ్చు. మురళీ విజయ్ గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్ గా ఆడారు. ఈ సంవత్సరం ఐపిఎల్ ఆక్షన్ లో ఏ ఫ్రాంచైజ్ మురళీ విజయ్ ని కొనుగోలు చేయలేదు. అంతే కాకుండా, దేశవాళీ క్రికెట్ లీగ్ లో పాల్గొనడానికి కూడా మురళీ విజయ్ ఆసక్తి చూపించకపోవడంతో కెరియర్ దాదాపు ఆగిపోయినట్టే అనే కామెంట్స్ వస్తున్నాయి.
End of Article