Ads
ఈసారి ఐపీఎల్ లో ఎంతో బాగా ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరిలో తడబడడం తో ఫైనల్స్ కి వెళ్ళలేకపోయింది. దాంతో అభిమానులుకి నిరాశ ఎదురైంది. ఐపీఎల్ 2021 లో కొందరు ప్లేయర్స్ ని జట్టులోకి తీసుకోవడం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సమస్యలు తొలగే అవకాశం ఉంది.
Video Advertisement
జేసన్ రాయ్
ఐపీఎల్ 2020 లో ఒక ఓపెనర్ అయిన దేవ్‌దత్ పడిక్కల్ జట్టు కి ప్లస్ పాయింట్ గా నిలిచారు. కానీ ఇంకొక ఓపెనర్ సమస్య తీరలేదు. జోష్ ఫిలిప్, ఆరోన్ ఫించ్ ఆడినా కూడా పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. ఈ కారణంగా ఎలిమినేటర్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా ఆడారు. ఒకవేళ 240 టీ20ల్లో 145 స్ట్రైక్ రేట్‌తో 6500 రన్స్ చేసిన జేసన్ రాయ్ ని ఈసారి టీం లోకి తీసుకుంటే దేవ్‌దత్ పడిక్కల్ కి మంచి ఓపెనర్ తోడుగా దొరికే అవకాశం ఉంది.
షకీబ్ అల్ హసన్
జట్టులో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్నా కూడా, నాలుగవ స్థానంలో లేదా ఐదవ స్థానంలో ఒక మంచి బ్యాట్స్‌మెన్ అవసరం ఉంది. బంగ్లాదేశ్ స్పిన్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఉంటే మిడిల్ ఓవర్లలో జట్టు జోరు అందుకునే అవకాశాలు ఉంటాయి.
కార్లోస్ బ్రాత్‌వైట్
పవర్ హిట్టర్ కార్లోస్ బ్రాత్‌వైట్ టీం లో ఉంటే మంచి ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆరవ బౌలింగ్ ఆప్షన్ గా కూడా కార్లోస్ బ్రాత్‌వైట్ ఉపయోగపడతారు.
లియామ్ ప్లంకెట్
అసలు రాయల్ ఛాలెంజర్స్ కి అతి పెద్ద సమస్య బౌలింగ్. ఉమేష్ యాదవ్, డేల్ స్టెయిన్ ఎక్కువగా పరుగులు ఇస్తుండడంతో వాళ్ళిద్దరినీ ఆడించే రిస్క్ కోహ్లీ తీసుకోలేదు. 10 కోట్లు పెట్టి క్రిస్ మోరిస్ ని తెచ్చుకున్నా కూడా ఫలితం లేదు. 9 మ్యాచ్ లలో 11 వికెట్స్ మాత్రమే తీయగలిగారు. అంతే కాకుండా క్రిస్ మోరిస్ కి గాయం అవ్వడంతో జట్టు ఇబ్బందులు ఎదుర్కొంది. పేస్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించగల ఒక ఫాస్ట్ బౌలర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అవసరం. ఇంగ్లీష్ పేసర్ లియామ్ ప్లంకెట్ అయితే ప్రస్తుతం జట్టు అవసరాలకి సరిపోతారు.
End of Article