Ads
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా జట్టు నుండి దూరం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2022 ఆక్షన్ లో 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీపక్ చాహర్ ని జట్టు కొనుగోలు చేసింది. కానీ దీపక్ చాహర్ తొడ కండరాల గాయం కారణంగా బాధపడుతున్నారు.
Video Advertisement
దాంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. దీపక్ చాహర్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎవరో ఒకరు కావాలి. ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 రాజ్‌వర్ధన్ హంగర్కర్
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన టీం ఇండియాలో సభ్యులు రాజ్‌వర్ధన్ హంగర్కర్. రాజ్‌వర్ధన్ హంగర్కర్ ని చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలంలో 1.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. రాజ్‌వర్ధన్ హంగర్కర్ 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలుగుతారు. వరల్డ్ కప్ టోర్నీలో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో వరుసగా మూడు సిక్సర్లు చేశారు.
#2 కేఎమ్ ఆసిఫ్
ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడారు ఆసిఫ్. మొదట దుబాయ్ లో నివసించిన ఆసిఫ్ అంతకు ముందు ఒక స్టోర్ కీపర్ గా కూడా పని చేశారు. యూఏఈ జట్టులో స్థానం సంపాదించేందుకు ఆసిఫ్ చాలా కష్టపడ్డారు. కానీ అక్కడ నిరాశే ఎదురయ్యింది. 2018 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది.
#3 తుషార్ దేశ్‌పాండే
ఐపీఎల్ 2020 లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అడుగుపెట్టారు ముంబై పేసర్ తుషార్ దేశ్‌పాండే. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి నెట్ బౌలర్ గా కూడా వ్యవహరించారు. ఐపీఎల్ లో ఇప్పటివరకు మొత్తంగా 5 మ్యాచ్ లు ఆడారు. అందులో మూడు వికెట్లు పడగొట్టారు. దేశవాళీ టీ20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచారు.
వీరిలో ఎవరైనా దీపక్ చాహర్ స్థానం భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.
End of Article