ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ మానియా నడుస్తోంది.ఇది యువ ఆటగాళ్లకు ఒక మంచి వేదికగా నిలుస్తోందని చెప్పవచ్చు. గతంలో కూడా ఎంతో మంది కొత్త ఆటగాళ్ళు వారి ప్రతిభతో టీమ్ ఇండియా లో కూడా చోటు సంపాదించారు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో చాలామంది అన్ క్యాపుడు ఆటగాళ్లు వారి యొక్క ప్రతిభను నిరూపించుకున్నారు.. కానీ ఈ సీజన్ లో బెంచీపై కూర్చున్నటువంటి కొందరు ప్లేయర్స్ కూడా ఉన్నారు.

Video Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ రెండవ రౌండ్ లో ఇంకా 7 మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి. 10 జట్లు ఉండటంతో మొత్తం 70 మ్యాచ్ లు జరగవలసి ఉంది. ఐపీఎల్ చివరి మ్యాచ్ మే 22 వ తేదీన జరగనుంది. అలాగే నాకౌట్ రౌండ్ మ్యాచ్లు మే 24న ప్రారంభం కానున్నాయి. ఈనెల 29న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ ఆట జరగనుంది. ఐపీఎల్ సీజన్ లో కొంతమంది అన్ క్యాపుడు ప్లేయర్స్ వారి ఆటతో అదరగొట్టారు.

ఇందులో ముఖ్యంగా జితేష్ శర్మ, ఆయుష్ భాదోని, ఉమ్రాన్ మాలిక్ వంటి ప్లేయర్లు ఉన్నారు. ఇందులో కొంత మంది యువ ప్లేయర్స్ కు వారి ప్రతిభను చూపించే అవకాశం రాలేదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐదవసారి అండర్19 ప్రపంచ చాంపియన్ గా నిలిచిన ప్లేయర్స్ ఉన్నారు.

#1 రాజ వర్ధన్ హంగార్గేకర్
ఇండియా అండర్ 19 ప్రపంచ ఛాంపియన్ గా నిలపడానికి ఈ ఆల్రౌండర్ ముఖ్య పాత్ర పోషించాడని చెప్పవచ్చు. ఈ యొక్క టోర్నీలో రాజ వర్ధన్ ఐదు వికెట్లతో పాటుగా 52 పరుగులతో మెరిశాడు. ఇతన్ని ఐపీఎల్ మెగా వేలంలో చెన్నై బేస్ దర 30 లక్షల రూపాయలకు ఐదు రెట్లు ఎక్కువ చెల్లించి 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆయనకు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.

#2 యష్ దుల్
ఈ ఆటగాడు కూడా అండర్-19 ప్రపంచకప్ లో బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించారు. కరోనా వైరస్ కారణంగా యష్ నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. కానీ అతను 76 సగటుతో 259 పరుగులు చేయగలిగాడు.. దీని తర్వాత యష్ ను ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ జట్టు 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ 12 మ్యాచ్లు ముగిసిన ఇతనికి ఆడే అవకాశం రాలేదని చెప్పవచ్చు.

#3 అనిశ్వర్ గౌతమ్
ఇతను కూడా అండర్ 19 ప్రపంచ కప్ గెలవడం లో కీలక పాత్ర పోషించాడు. ఎడమ చేతి వాటం బౌలర్. ఆల్ రౌండర్ కూడా. ఇతన్ని మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 లక్షల కొనుగోలు చేసింది. ఇతను కూడా ఈ సీజన్ మొత్తం బెంజ్ పైనే కూర్చున్నాడు.

#4రాజు బావా
ఇతను అండర్-19 ప్రపంచకప్ లో 9 వికెట్లు 252 పరుగులతో సంచలనం సృష్టించాడు. ఇతని ఆల్రౌండ్ ప్రదర్శన చూసిన పంజాబ్ జట్టు ఈ ప్లేయర్ పై బెట్టింగ్ ఆడి మరి బెస్ట్ ధర 20 లక్షల కంటే 10 రేట్లు ఎక్కువ పెట్టి రెండు కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ సీజన్ లో రెండు మ్యాచ్ లు ఆడిన రాజ్. ఒక మ్యాచ్లో ఖాతా తెరువలేక పోయినా రెండవ మ్యాచ్ లో మాత్రం 11 పరుగులు చేశారు.

#5 విక్కీ ఓస్త్వాల్

అండర్-19 ప్రపంచకప్ లో ఇండియా తరఫున 12 వికెట్లు తీసి ఔరా అనిపించుకున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో ఇతన్ని ఢిల్లీ జట్టు 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతను కూడా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడడానికి అవకాశం రాలేదు.