పాకిస్తాన్ ప్లేయర్ “బాబర్ అజాం” తో పాటు… ఈ వరల్డ్ కప్ లో “ఫెయిల్” అయిన 10 ప్లేయర్స్ వీరే..!

పాకిస్తాన్ ప్లేయర్ “బాబర్ అజాం” తో పాటు… ఈ వరల్డ్ కప్ లో “ఫెయిల్” అయిన 10 ప్లేయర్స్ వీరే..!

by Mounika Singaluri

Ads

2023 వన్డే ప్రపంచ కప్ లీగ్ స్టేజ్ ముగిసి ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇండియా అభిమానుల అంచనాలను నిజం చేస్తూ సెమీఫైనల్ కి చేరుకుంది. అయితే ఈ వరల్డ్ కప్ ప్రారంభంలో చాలామంది ప్లేయర్స్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాలామంది సీనియర్ ప్లేయర్స్ అభిమానుల అంచనాలను తలకిందులు చేశారు.

Video Advertisement

బాగా రాణిస్తారు అనుకున్న వారు చేతులెత్తేశారు. అనూహ్యంగా అంచనా లేనివారు మంచి ప్రదర్శన కనబరిచారు. అయితే మంచి అంచనాలతోటి వరల్డ్ కప్ లోకి ఎంటర్ అయ్యి, ఫెయిల్ అయిన పదిమంది ఆటగాళ్ల లిస్ట్ మీకోసం….

1. టామ్ లెతమ్:

న్యూజిలాండ్ కి చెందిన ఈ వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ ప్రపంచ కప్ లోకి మంచి అంచనాల మధ్య ఎంటర్ అయ్యాడు. కేన్ విలియమ్సన్ లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే అనుకున్నంత విధంగా టామ్ రాణించలేదు. న్యూజిలాండ్ మేనేజ్మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది.అయితే అనుకున్న విధంగా టామ్ ప్రదర్శన లేదు.ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు 155 పరుగులు మాత్రమే చేశాడు.

2. షదాబ్ ఖాన్:

పాకిస్తాన్ కి చెందిన యంగ్ ఆల్ రౌండర్ వరల్డ్ కప్ లోకి భారీ అంచనాలు మధ్య బరిలోకి దిగాడు. పాకిస్తాన్ అతనికి వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా అప్పగించింది. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లో కూడా విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్ లు ఆడిన ఇతను 121 పరుగులు మాత్రమే చేశాడు.

3.మిచెల్ స్టార్క్:

 

ఈ లిస్టులో ఇతని పేరు ఉండడం ఆశ్చర్యానికి గురి చేసే విషయమే. గత వరల్డ్ కప్ లో మిచెల్ స్టార్క్ కి మంచి రికార్డు ఉంది. అయితే ఈ వరల్డ్ కప్ లో మాత్రం అనుకున్న విధంగా పెర్ఫామ్ చేయలేదు. మొత్తంగా ఇప్పటివరకు 10 వికెట్లు మాత్రమే తీశాడు.

4.స్టీవ్ స్మిత్:

steve smith lost free hit

ఈ పేరు గురించి పరిచయమే అక్కర్లేదు. ప్రపంచంలోనే ది బెస్ట్ బ్యాట్స్ మెన్. ఇండియా పిచ్ లలో మంచి రికార్డులు ఉన్నాయి. అయితే స్టీవ్ స్మిత్ అనుకున్న విధంగా ఈ వరల్డ్ కప్ లో రాణించలేదు.
మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 268 పరుగులు చేశాడు.

5. బాబర్ అజామ్:

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ వరల్డ్ కప్ లో తన మీద పెట్టుకుని అంచనాలన్నీ వొమ్ము చేసాడు. నాలుగు హాఫ్ సెంచరిలు అయితే చేశాడు కానీ అవి టీం కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. తన పూర్ పెర్ఫామెన్స్ కారణంగా కెప్టెన్సీ నుంచి తొలగించాలనే విమర్శలు కూడా ఎదుర్కున్నాడు.

6. లియాం లివింగ్ స్టోన్:

ఇంగ్లాండ్ కి చెందిన ఈ సీనియర్ బ్యాట్స్ మెన్ ఈ వరల్డ్ కప్ లో ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేశాడు. ఐపీఎల్ లో ఇతనికి మంచి రికార్డు ఉంది. అయితే వరల్డ్ కప్ లో ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఆరు మ్యాచులు ఆడి కేవలం 60 పరుగులు మాత్రమే చేశాడు.

7. టెంబా బావూమా:

సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ కం ఓపెనర్ బ్యాట్స్ మెన్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ కి ముందు మంచి కన్సిస్టెన్సీ తో పెర్ఫామెన్స్ చేశాడు. అయితే ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లలో మాత్రం అనుకున్న విధంగా పెర్ఫామ్ చేయలేదు.మొత్తంగా 145 పరుగులు మాత్రమే చేశాడు.

8. జోస్ బట్లర్:

ఈ వరల్డ్ కప్ లో అందరికంటే ఎక్కువగా డిసప్పాయింట్ చేసింది ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్.
డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్టీం లో ఇతను పైన భారీ అంచనాలు ఉన్నాయి. అయితే బట్లర్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేశాడు.9 మ్యాచ్ లు ఆడి కేవలం 138 పరుగులు మాత్రమే చేశాడు.

9.జో రూట్:

ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ మీద ఈ వరల్డ్ కప్ లో మంచి అంచనాలు ఉన్నాయి. గత ఐపీఎల్ లో కూడా బాగా రాణించాడు. వరల్డ్ కప్పుకి ముందు మంచి యావరేజ్ కూడా ఉంది. అయితే రియాల్టిలో పెర్ఫార్మన్స్ మాత్రం అనుకున్న విధంగా లేదు. కేవలం 276 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

10. జానీ బెయిర్ స్టో:

ఈ ఇంగ్లాండ్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్ మెన్ పైన వరల్డ్ కప్ కి ముందు మంచి అంచనాలు ఉన్నాయి. ఇండియాలో బాగా పెర్ఫార్మ్ చేసే బెయిర్ స్టో వరల్డ్ కప్ లో దున్నేస్తారని అందరూ అనుకున్నారు కాకపోతే ఆ అంచనాలన్నీ తలకిందులు చేశాడు. 9 మ్యాచ్ లు ఆడి కేవలం 215 పరుగులు మాత్రమే చేశాడు.

Also Read:సిరాజ్ ఈ పద్ధతి మార్చుకోకపోతే ఓడిపోతాం ఏమో..? విషయం ఏంటంటే..?


End of Article

You may also like