మోడీ గొప్ప సందేశం ఇచ్చారు అన్న పాక్ లెజెండ్…

మోడీ గొప్ప సందేశం ఇచ్చారు అన్న పాక్ లెజెండ్…

by Mounika Singaluri

Ads

2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెందిన తర్వాత క్రికెట్ ప్లేయర్లు అందరూ తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బౌలర్లు సిరాజ్, షమీ తదితరులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని చూసి భారత అభిమానులకు గుండె ముక్కలైంది. ఎన్నో ఆశలతో వరల్డ్ కప్ లోకి అడుగు పెట్టాక ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడం అంటే అది మామూలు విషయం కాదు.

Video Advertisement

మన భారత ఆటగాళ్లు కన్నీళ్లు చూసిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వారికి మద్దతుగా నిలబడ్డారు. భారత్ ఒక గొప్ప టీం అని ప్రశంసించారు. గొప్పగా ఆట తీరు కనబరిచారని ఫైనల్ మ్యాచ్ ఒకటి మనకి అనుకూలంగా ఫలితం రాలేదని అన్నారు.

india modi pak

అయితే మ్యాచ్ అయిపోయాక డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఆటగాళ్ల వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లి ఓదార్చారు. ఆటలో గెలుపు ఓటములు సహజమంటూ ధైర్యం చెప్పారు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మాలను చేతులు పట్టుకుని ఓదార్చారు. బౌలర్ మొహమ్మద్ షమీ కన్నీటి పర్యంతమైతే మోడీ హత్తుకుని మరేం పర్లేదు అంటూ భరోసా ఇచ్చారు. ఈ చర్య ద్వారా మోడీ దేశమంతా మీ వెంట ఉంది అంటూ క్రికెటర్లకు తెలియజేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యాయి.

దేశ ప్రధాని ఇలా ఆటగాళ్లకు మద్దతుగా నిలబడటం చాలా అభినందించదగ్గ విషయమని పలువురు అన్నారు.అయితే ఇప్పుడు ఈ చర్యపైన పాక్ మాజీ ఆటగాడు షోయభ్ అక్తర్ స్పందించాడు. ప్రధాని మోడీ తమ దేశ ఆటగాళ్లను ఓదార్చిన తీరు చూస్తే సొంత బిడ్డలను ఒదార్చినట్టు ఉందని అన్నాడు. మోడీ ప్రవర్తించిన తీరు నిజంగా గొప్పగా ఉందని అన్నాడు.ఈ చర్య ద్వారా ఆటగాళ్లకు ఉత్తేజం వస్తుంది అని అభిప్రాయ పడ్డాడు.నిజంగా అది భారతీయులకు ఒక ఉద్విగ్న క్షణం అని అన్నాడు.

 

Also Read: ICC ప్రవేశ పెట్టిన ఈ కొత్త రూల్ గురించి తెలుసా..? ఇది అతిక్రమిస్తే ఏం జరుగుతుందంటే..?


End of Article

You may also like