Ads
2019 లో డోపింగ్ టెస్టులో టీం ఇండియా ఓపెనర్, యువ క్రికెటర్ పృథ్వీ షా విఫలమయ్యి క్రికెట్ నుండి 8 నెలల బ్యాన్ కి గురైన సంగతి మన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ విషయంపై పృథ్వీ షా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయానికి సంబంధించి తన మనసులో మాటని చెప్పారు. ఆరోజు జరిగిన విషయాన్ని వివరిస్తూ పృథ్వీ షా ఈ విధంగా చెప్పారు.
Video Advertisement
“2019 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడటానికి ఇండోర్ కి వెళ్లాను. అక్కడ ఒక రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత నుండి విపరీతమైన దగ్గు మొదలయ్యింది. నీళ్లు తాగిన కూడా అస్సలు తగ్గలేదు. దాంతో నాన్నకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లి కాఫ్ సిరప్ కొనుక్కొని తాగమని నాన్న చెప్పారు. నేను నా ఫిజియోతో ఈ విషయం గురించి సంప్రదించకుండా వెళ్లి కాఫ్ సిరప్ తీసుకొని తాగాను.
ఆ టెస్ట్ లో నేను పాజిటివ్ గా తేలాను. దాంతో నన్ను ఒక డోపీ గా తేల్చేవారు. నాకు ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. దాని గురించి నేను మాటల్లో చెప్పలేను. నా జీవితంలో ఆ సమయం చాలా కష్టమైన పీరియడ్. ఇంతకాలం నన్ను ఇష్టపడిన నా సహచరులు, క్రికెట్ అభిమానులు ఏమనుకుంటారో అని చాలా ఆందోళన పడ్డాను.
కెరియర్ నిర్మించుకుంటున్న ఆ సమయంలో ఇలాంటి సంఘటన జరగడంతో ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోయింది. నిషేధానికి గురి అయిన కారణంగా రెండున్నర నెలలు ఇంట్లో గడిపాను. డోప్ టెస్ట్ కి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా వచ్చేవి. దీంతో చాలా కుంగిపోయాను. కానీ బీసీసీఐ, 8 నెలల నిషేధాన్ని రెండు నెలలకు తగ్గించింది.
దీంతో నాకు ఊరట లభించింది. అప్పటికే నేను అంతర్జాతీయ ఆటకు దూరమైన పీరియడ్ ని కూడా పరిగణలోకి తీసుకోవడం వల్ల ఈ తగ్గింపు లభించింది” అని అన్నారు. నిషేధం తర్వాత జట్టులోకి వచ్చిన పృథ్వీ షా 2020 లో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యారు. ఆ తర్వాత యూఏఈ లో జరిగిన ఐపీఎల్ లో ఆకట్టుకోలేకపోయిన కూడా ఐపీఎల్ 2021 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడిన పృథ్వీ షా చాలా బాగా రాణించారు.
End of Article