రెండో టెస్ట్ ఆడే భారత్ జట్టు ఇదే…అతడికి అవకాశం ఇస్తున్నారా..?

రెండో టెస్ట్ ఆడే భారత్ జట్టు ఇదే…అతడికి అవకాశం ఇస్తున్నారా..?

by Mounika Singaluri

Ads

ప్రస్తుతం భారత్ జట్టు ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఓటమికి భారత్ ఫీల్డింగ్, బ్యాటింగ్ ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే మొదటి మ్యాచ్ తప్పుల నుండి నేర్చుకున్న భారత ఆటగాళ్లు మిగిలిన మ్యాచ్ లు ఎలాగైనా నెగ్గాలానే కసి మీద ఉన్నారు. ఈ సందర్భంగా రెండో టెస్టు మ్యాచ్ ఆడే భారత జట్టు కూర్పు పైన ప్రత్యేక దృష్టిసారించారు.

Video Advertisement

రెండో టెస్టులో పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం ఈ విషయంపై క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని, టీమ్‌ మొత్తం యువ రక్తంతో నింపేశారు. కానీ…. టెస్ట్‌ క్రికెట్‌ అంటే లెక్క వేరే ఉంటుందని… పూర్తిగా యువ క్రికెటర్లతో వెళ్తే ఎదురుదెబ్బ తగులుతుందని తాజాగా తొలి మ్యాచ్‌తోనే అర్థమైంది. అందుకే రెండో టెస్ట్‌ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టెస్ట్ మ్యాచ్ కి అనుభవం ఉన్న క్రికెటర్ అవసరం. విరాట్ కోహ్లీ లేకపోవడంతో ఆ లోటు కనిపిస్తుంది. ఇప్పుడు ఆస్థానాన్ని భర్తీ చేయడానికి.. వెటరన్‌ ప్లేయర్‌, టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చతేశ్వర పుజారా లేదా అజింక్యా రహానెలలో ఒకరిన టీమ్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే పుజారాకు సైతం ఈ విషయంపై సమాచారం ఇచ్చినట్లు క్రికెట్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. పుజారా, రహానెల్లో.. పుజారాకే ఎక్కవ ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే టీం కి బాగా ప్లస్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.


End of Article

You may also like