అండర్‌ –19 వరల్డ్‌‌కప్‌ సెమీస్‌లో టీమిండియా రెచ్చిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ టీమ్‌ను 43.1 ఓవర్లకే ఆలౌట్ చేసింది. 172 పరుగులకే పాక్ బ్యాట్స్ మెన్‌ని చిత్తు చేశారు మన బౌలర్స్. టీమిండియా ముందు 173 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది పాక్. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే మన బౌలర్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేశారు. మనోళ్ల ఫోర్స్ తట్టుకోలేకపోయిన పాకిస్థాన్ ఆటగాళ్లు కేవలం ముగ్గురు తప్ప మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. అయితే 31వ ఓవ‌ర్‌లో గ‌మ్మ‌త్తు ఘ‌ట‌న జ‌రిగింది. ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్ ఒకేవైపు ప‌రుగు తీశారు. దీంతో ఒక‌రు ర‌నౌట‌య్యారు.

Video Advertisement

స్పిన్న‌ర్ ర‌వి బిష్ణ్నాయ్ వేసిన ఓవ‌ర్‌లో.. ఇద్ద‌రు పాక్ బ్యాట్స్‌మెన్ అయోమ‌యంలో ఒకేవైపు ప‌రుగు తీశారు.  స్ట్ర‌యికింగ్ ఎండ్‌లో ఉన్న ఖాసిమ్ అక్ర‌మ్‌కు ర‌వి బౌల్ చేశాడు. డ్రాప్ షాట్ ఆడిన ఖాసిమ్ ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించాడు.  ఇక నాన్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ న‌జీర్‌.. తొలుత ర‌న్ కోసం ముందుకు క‌దిలాడు. కానీ భార‌త ఫీల్డ‌ర్ అంకోలేక‌ర్ చురుకుగా బంతిని అందుకుని కీప‌ర్ జూర‌ల్‌కు అందించాడు.  ప‌రుగు తీసిన ఖాసిమ్ మాత్రం దుర‌దృష్ట‌క‌ర‌రీతిలో ఔటయ్యాడు.

Watch Video Click Here >> Video <<

పాక్ రనౌట్ల చరిత్రను గుర్తుకు తెస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘పాకిస్థాన్ ఎప్పటికీ పాకిస్థానే. కొన్ని అలవాట్లు ఎప్పటికీ మారవు’ అని ఒకరంటే.. ‘ఇది ట్రేడ్ మార్క్ రనౌట్. గతంలో ఇలాంటివి ఎన్ని చూడలేదూ..’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. పాకిస్థాన్ ప్రదర్శన తాత్కాలికమేనని, కానీ రనౌట్లు మాత్రం శాశ్వతమని మరికొరు ఎద్దేవా చేశారు.  …ఇప్పుడు ఈ రన్ అవుట్ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేసింది ….పాక్ ప్లేయర్స్ మీద ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఎంజయ్ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్

Watch Video Click Here