క్వాలిఫయర్‌-1 లో ఢిల్లీ ఓడిపోవడం పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ….క్వాలిఫయర్‌-2 ఆడుకుంటాం అంటూ

క్వాలిఫయర్‌-1 లో ఢిల్లీ ఓడిపోవడం పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ….క్వాలిఫయర్‌-2 ఆడుకుంటాం అంటూ

by Anudeep

Ads

ఐపీఎల్ 2020 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ముంబై  ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.ఐపీఎల్‌-13 క్వాలిఫయర్‌-1లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు.  టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన  ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 రన్స్ చేసింది. సూర్య కుమార్ యాదవ్‌(51),  ఇషాన్‌ కిషన్‌(55 నాటౌట్),‌  క్వింటన్‌ డికాక్‌(40), హార్దిక్ పాండ్య(37) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో  5 వికెట్లకు 200 పరుగులు చేసింది.ఢిల్లీ బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా, అన్రిక్, స్టోయినిస్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.

Video Advertisement

తర్వాత భారీ స్కోర్‌ను చేధించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరంభంలోనే బొక్కబోర్లా పడింది.ముంబై బౌలర్లు దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా, శిఖర్ ధావన్, ఆజింక్య రహానే డకౌట్ అయ్యారు. 0 పరుగులకే మొదటి మూడు వికెట్లు కోల్పోయింది . 4వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్, 8వ ఓవర్లలో రిషబ్ పంత్ కూడా ఔట్ కావడంతో ఢిల్లీ టీమ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.మార్కస్ స్టోయినిస్ 65 పరుగులు,అక్షర్ పటేల్ 42 పరుగులు చేసారు .ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులు మాత్రమే చేసింది .ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు సాధించగా, బౌల్ట్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. కృనాల్‌ పాండ్యా, పొలార్డ్‌లకు తలో వికెట్‌ దక్కింది.ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడినప్పటికీ మరొక అవకాశం ఉంది. ఆర్సీబీ-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో ఢిల్లీ క్వాలిఫయర్‌-2లో తలపడనుంది.క్వాలిఫయర్‌-1 లో ఢిల్లీ ఓడిపోవడం పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ….
#1
#2 #3 #4

#5 #6 #7 #8 #9 #10 #11 #12 #13

#14

#15

#16 #17 #18


End of Article

You may also like