అంతమంచి ప్లేయర్ ని టీంలో నుండి తీసేసారు ఏంటి.? దీని వెనక ఆ ప్లాన్ ఉందా.?

అంతమంచి ప్లేయర్ ని టీంలో నుండి తీసేసారు ఏంటి.? దీని వెనక ఆ ప్లాన్ ఉందా.?

by Harika

Ads

సౌత్ ఆఫ్రికాతో జరిగే టెస్టు సిరీసుకు కూడా భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అయితే ఈ సిరీసులో కొత్త కుర్రాడు రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం అందించింది బీసీసీఐ. ఈ టీం చూస్తుంటే అందులో ముగ్గురు సీనియర్ బ్యాటర్లు మిస్ అయినట్లు కనిపిస్తుంది. వాళ్లు మరెవరు కాదు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఉమేష్ యాదవ్. అయితే వీరిలో రహానేను పక్కన పెట్టడం ఫ్యాన్స్‌ కు ఏమాత్రం నచ్చడం లేదు. ఇదే విషయంపై బీసీసీఐ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ధనాధన్ ఆటతో రహానే అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో అతన్ని డబ్ల్యూటీసీ ఫైనల్‌ కు ఎంపిక చేశారు.

Video Advertisement

ఆ మ్యాచులో రెండు ఇన్నింగ్స్ లో రాణించిన ఏకైక టీమిండియా బ్యాటర్ రహానే అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అతన్ని మళ్లీ వైస్ కెప్టెన్‌గా కూడా బీసీసీఐ నియమించింది. ఆ సమయంలో చాలామంది బీసీసీఐ కరెక్ట్ నిర్ణయం తీసుకుందా అని అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీసులో రహానే తేలిపోయాడు. పేలవ ఫామ్‌తో బాధ పడిన అతను 3, 8 స్కోర్లు నమోదు చేశాడు. ఇలాంటి సమయం లోనే గాయాల నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

వీళ్లు తిరిగి రావడంతో రహానేను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. ఇక టెస్టు స్పెషలిస్టు ఛటేశ్వర్ పుజారాను కూడా అలాగే సైడ్ చేసేశారు. ఇదంతా చూస్తుంటే వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇప్పటి నుంచే జట్టును రెడీ చేయడానికి బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్‌కు మాత్రం ఈ నిర్ణయం పెద్దగా నచ్చలేదు. రహానే వంటి కీలక ప్లేయర్‌ను పక్కన పెట్టేయడం భారత జట్టుకే నష్టమని, ఫ్యూచర్‌లో బీసీసీఐ ఈ నిర్ణయం వల్ల చాలా బాధపడాల్సి వస్తుంది అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.


End of Article

You may also like