భారత జట్టుతో కలిసి ట్రావెల్ చేస్తున్న ఈ యువతి ఎవరు..? టీం లో ఆమె స్థానం ఏమిటి.?

భారత జట్టుతో కలిసి ట్రావెల్ చేస్తున్న ఈ యువతి ఎవరు..? టీం లో ఆమె స్థానం ఏమిటి.?

by kavitha

Ads

టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్న ఏకైక మహిళ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎవరు ఆమె, టీమిండియాలో ఆమె ఏం చేస్తున్నారు అంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు క్రికెట్ అభిమానులు. అయితే ఆమె పేరు రాజ్ లక్ష్మి అరోరా. ఈమె టీం ఇండియా సపోర్టింగ్ స్టాఫ్ లో కీలక సభ్యురాలు. ఈమె గత కొన్ని ఏళ్లుగా బీసీసీఐకి కంటెంట్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తుందట. ఇక టీమ్ ఇండియా విదేశాల్లో పర్యటించినప్పుడు ఈమె ఖచ్చితంగా జట్టుతో పాటు ఉంటుందని తెలిసింది.

Video Advertisement

ఈమె పూణేలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ లో చదువుకుంది. అక్కడే ఆమె బాస్కెట్ బాల్ షూటింగ్ గేమ్స్ పై ఆసక్తి పెంచుకుంది. తర్వాత జర్నలిస్టుగా కెరియర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత 2015లో సోషల్ మీడియా మేనేజర్ గా బీసీసీఐలో చేరింది. ప్రస్తుతం ఆమె బీసీసీఐకి సంబంధించిన సోషల్ మీడియా ముఖ్య పర్యవేక్షకురాలుగా వ్యవహరిస్తుందని తెలిసింది.

అలాగే ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులను పర్యవేక్షించే అధికారిణి గా కూడా పనిచేస్తుంది. బీసీసీఐ సోషల్ మీడియా మేనేజర్ గా దాదాపుగా 9 ఏళ్ల పాటు పనిచేసిన ఆరోరా ఆ తర్వాత సీనియర్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు చేపట్టారు. అరోరా ఎప్పటికప్పుడు టీం ఇండియా ప్లేయర్లకు సంబంధించిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరవేస్తుంది. ప్లేయర్లకు సంబంధించిన, ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోలను ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడంలో ఈమెదే కీలక పాత్ర.

ప్రస్తుతం బీసీసీఐకి ఎక్స్ లో మొత్తం మూడు అధికారిక ఖాతాలో ఉన్నాయి ఒకటి బీసీసీఐ, రెండోది బిసిసిఐ ఉమెన్, మూడోది బీసీసీఐ డొమెస్టిక్. ఈ మూడు ఖాతాలకు సంబంధించిన బాధ్యతలు అన్నిటినీ ఆరోరానే నిర్వహిస్తూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్, ఎక్స్ లలో 60 కే 29కే ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది అరోరా. రాజల్ అరోరా అనే యూజర్ పేరుతో ఈమె ఎకౌంటు ఉంటుంది.


End of Article

You may also like