ప్రస్తుతం ప్రేక్షకుల గుండెల్లో ‘గుప్పెడంత మనసు’ పునాది వేసుకుందంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ సీరియల్ రేటింగ్ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉంది.

Video Advertisement

ఇటీవల ఓ వేడుకకు హాజరైన ఈ సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ తన ప్రాజెక్ట్స్ గురించి రివిల్ చేసింది. బుల్లితెరలో ప్రేక్షకులను అలరించిన రక్షా త్వరలో వెండి తెరపై కూడా అలరిస్తున్నట్లు తెలిపింది.

కార్తీకదీపం తర్వాత టాప్ రేటింగ్ ఇచ్చే సీరియల్ గుప్పెడంత మనసు. కానీ రాత్రి 7గంటలకు వచ్చే గుప్పెడంత సీరియల్ టైమింగ్‌ని రాత్రి 6గంటలకు మార్చారు. దీంతో సీరియల్ రేటింగ్ పడిపోయినట్లు సమాచారం. రేటింగ్ పాయింట్లలో టాప్ రేటింగ్‌లో ఉండే ఈ సీరియల్ సగానికి సగం రేటింగ్ పడిపోయింది.

7గంటలకు అయితే మహిళలు పనులు చేసి, ఆపీస్ నుంచి వచ్చి టీవీ చూడగలరు. కానీ 6గంటలకు కావడం వల్ల వాళ్లు ఆ సమయంలో ఎక్కువగా పనులు చేసుకుంటున్నారని రక్ష స్పందించింది. గుప్పెడంత మనసు సీరియల్ ప్రేమికులు దీని టైమింగ్ అంటే ఇంతకుముందులా రాత్రి 7గంటలకు మార్చాలని కోరుకుంటున్నారు.

ఇదే విషయాన్ని రక్షాని అడగ్గా.. టైమింగ్ ఏదైనా సరే.. మా సీరియల్‌ టాప్ అని సమాధానం ఇచ్చింది. పరిస్థితుల్ని బట్టి సీరియల్ టైమింగ్ మార్చారు. ఇలా మార్చడానికి ఎలాంటి కారణాలు లేవని రక్షా తెలిపారు. కానీ ఇంతకుముందు కంటే ఇప్పుడు రేటింగ్ కాస్త తక్కువైంది. కానీ ఇది టైం ఛేంజ్ వల్ల అయితే కాదని రక్షా తెలిపింది.