ఓ వైపు కూతురు మరణం.. మరోవైపు రంజీ మ్యాచ్.. ఈ బరోడా క్రికెటర్ కి ఫ్యాన్స్ సలాం.. ఎందుకంటే?

ఓ వైపు కూతురు మరణం.. మరోవైపు రంజీ మ్యాచ్.. ఈ బరోడా క్రికెటర్ కి ఫ్యాన్స్ సలాం.. ఎందుకంటే?

by Anudeep

Ads

ఇటీవల జరిగిన రంజీ ట్రోఫిలో క్రికెటర్ విష్ణు సోలంకి బరోడా తరపున ఆడాడు. చండీగఢ్‌పై సెంచరీ కొట్టి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు. ఎన్నో కష్టాలని అధిగమించి క్రికెటర్ అయిన విష్ణు.. గుండెలలో ఎంతో బాధని అదిమిపెట్టుకుని ఈ మ్యాచ్ ను ఆడారు.

Video Advertisement

అందుకే ఆయనను యావత్ క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇటీవలే ఆయనకు కూతురు పుట్టింది.

vishnu 1

కానీ, ఆమె అనారోగ్యంగా కారణంగా ఆమె ఈ లోకాన్ని వీడింది. అంత బాధని విష్ణు గుండెల్లో దాచుకుని ఆమెకు అంత్యక్రియలు చేసాడు. అంత్య క్రియలు పూర్తి అవ్వగానే విష్ణు సోలంకి మైదానంలో అడుగుపెట్టి రంజీ మ్యాచ్ ను ఆడాడు. అంత బాధని అదిమిపెట్టుకుని తన జట్టు తరపున సెంచరీ చేసాడు.

vishnu 2

చండీఘడ్ పై 12 ఫోరులు కొట్టి.. ఏకంగా 104 పరుగులు చేసాడు. బరోడా క్రికెట్ అసోసియేషన్ విష్ణుని రియల్ హీరోగా పేర్కొంటోంది. సౌరాష్ట్ర తరపున రంజీ ఆడుతున్న బ్యాట్స్‌మెన్ షెల్డన్ జాక్సన్ విష్ణు గురించి ట్వీట్ చేసారు. “విష్ణు, మరియు అతని కుటుంబానికి నమస్కారాలు.. విష్ణు బ్యాట్ నుంచి మరిన్ని సెంచరీలు రావాలని కోరుకుంటున్నట్లు” ట్వీట్ చేసారు. విషాదకరమైన విషయం ఏమిటంటే.. కూతురుని కోల్పోయిన మరుసటిరోజే విష్ణు తండ్రిని కూడా కోల్పోయాడు. 29 ఏళ్ల వయసులోనే విష్ణు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

vishnu 3

అయితే.. ఇలాంటి సెంచరీలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల జీవితంలో కూడా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ కూడా 1999 ప్రపంచ కప్ టైములో ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ మరణించిన వెంటనే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ లో కూడా సచిన్ సెంచరీ కొట్టారు. విరాట్ కోహ్లీకి కూడా ఇలానే జరిగింది. రంజీ మ్యాచ్ లో ఢిల్లీ జట్టుకు ఆడుతున్న టైములో ఆయన తండ్రి హఠాత్తుగా మరణించారు. ఆ టైములో కూడా విరాట్ హాఫ్ సెంచరీ కొట్టి జట్టుని ఓటమినుంచి కాపాడాడు. ఆ తరువాత తండ్రి అంత్యక్రియలలో పాల్గొన్నాడు.


End of Article

You may also like