రజత్ పాటీదార్ ఈ ఒక్క మ్యాచ్ తోనే బెంగళూరు జట్టు లో హీరో అయిపోయాడు. లక్నో తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో చాలా అద్భుత ప్రదర్శన కనబరిచిన రజత్ పాటిదర్ కేవలం 54 బంతులలో 12/4,7/6 అజెయంగా 112 పరుగులు చేశారు.

Video Advertisement

డూప్లిసెస్ (0), కోహ్లీ (25)తో పాటుగా మ్యాక్స్వెల్ (9) చాలా తక్కువ స్కోరు చేసి అవుట్ అయిన సమయంలో, పాటిదర్ మెరుపు ఆటతో పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటున్నారు.

పాటిదర్ సెంచరీతో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించగా.. లక్ష్యఛేదనలో లక్నో టీం 193/6 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ ను గెలిపించి ఇన్నింగ్స్ ఆడిన రజత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిజానికి ఐపీఎల్ 2022 వేలంలో బెంగళూరు జట్టు రజత్ ను కొనుగోలు చేయలేదు. గత ఏడాది ఆర్సిబి తరఫున ఆడిన మిడిలార్డర్ బ్యాటరును రిటర్న్ కూడా చేసుకోలేదు. ఐపీఎల్ 2022 సీజన్లో 20 లక్షల కనీస ధర తో రజత్ పాటిదర్ రాగ బెంగళూరు కనీస బిడ్ కూడా వేయలేదు..

దీంతో ఏ ప్రాంచైజీ అతని పై ఆసక్తి చూపకపోవడంతో, ఆయన అన్ ఫోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయారు. ఐపీఎల్ 2021 లో నాలుగు మ్యాచులు ఆడిన పాటిదర్ 71 పరుగులు చేశారు. దీంతో ఆర్సిబి అతన్నీ వద్దనుకుంది. కానీ ఈ సీజన్ ప్రారంభంలోనే వికెట్ కీపర్ మరియు బ్యాటరు లూవింగ్ సిసోడియా గాయం వల్ల బెంగళూరు జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన రజత్ తన కెరీర్లో 31 t20 మ్యాచ్ లు ఆడి 138.64 స్ట్రైక్ రేట్ తో 861 పరుగులు చేసి ఉన్నాడు.

దీంతో అతన్ని జట్టులోకి తీసుకున్న వెంటనే తుది జట్టులో అవకాశం ఇచ్చింది. ఈ ఛాన్స్ లను రెండు చేతులా రజత్ ఉపయోగించుకున్నారు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన పాటిదర్ 156.25 స్ట్రైక్ రేట్ తో 275 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ మరియు హాఫ్ సెంచరీ కూడా ఉంది. అయితే లక్నో మ్యాచ్ జరిగిన తరువాత వేలంలో అతని తీసుకోకపోవడంపై స్పందించేందుకు అతడు నిరాకరించాడు. అది నా పరిధిలో ఉండని అంశమని చెప్పుకొచ్చారు.