సీరియల్స్ లో నటిస్తున్న 5 మంది రియల్ లైఫ్ అన్న – తమ్ముళ్లు వీరే.!

సీరియల్స్ లో నటిస్తున్న 5 మంది రియల్ లైఫ్ అన్న – తమ్ముళ్లు వీరే.!

by Mohana Priya

మన తెలుగు సీరియల్స్ కి ఎంత క్రేజ్ ఉందో మనందరికి తెలుసు. సీరియల్స్ కూడా సినిమాలతో సమానంగా పాపులర్ అవుతున్నాయి. ఇంకా చాలా మంది ప్రేక్షకులు అయితే సీరియల్ లో నటించే నటీనటులని తమ ఇంట్లో వారిగా భావిస్తారు. ముఖ్యంగా ఆ సీరియల్ లో నటించిన హీరో, హీరోయిన్లు అయితే ప్రేక్షకులకు చాలా దగ్గర అయిపోతారు.

Video Advertisement

గత ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో మంది హీరోలు మన సీరియల్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అలా కొంత మంది హీరోల్లో అన్నదమ్ములు కూడా ఉన్నారు. అలా అన్నదమ్ములైన సీరియల్ హీరోస్ ఎవరో మనం ఇప్పుడు చూద్దాం.

#1 నిఖిల్ – నాగార్జున

గోరింటాకు సీరియల్ లో హీరోగా నటిస్తున్న నిఖిల్, అలాగే కస్తూరి సీరియల్ లో హీరోగా నటిస్తున్న నాగార్జున అన్నదమ్ములు.

Brothers in telugu serial industry

#2 కృష్ణ కౌశిక్ – బాలాదిత్య

ఎన్నో సినిమాల్లో అలాగే సీరియల్స్ లో నటించిన కృష్ణ కౌశిక్, అలాగే సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తున్న బాలాదిత్య అన్నదమ్ములు అవుతారు. బాలాదిత్య ప్రస్తుతం సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో నటిస్తున్నారు.

Brothers in telugu serial industry

#3 వాసుదేవ్ – శ్రీధర్

కస్తూరి సీరియల్ లో నటిస్తున్న వాసుదేవ్, అలాగే రుద్రమదేవి సీరియల్ హీరో అయిన శ్రీధర్ అన్నదమ్ములు.

Brothers in telugu serial industry

#4 నిరుపమ్ – జై ధనుష్

వీరిద్దరూ సొంత అన్నదమ్ములు కాదు. నిరుపమ్ భార్య అయిన మంజుల, అలాగే జై ధనుష్ భార్య అయిన కీర్తి అక్కా చెల్లెళ్ళు అవుతారు. అలా నిరుపమ్, జై ధనుష్ అన్నదమ్ములు అవుతారు.

Brothers in telugu serial industry

#5 ఇంద్రనీల్ – అరవింద్

సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్, అలాగే ఎన్నో సినిమాల్లో నటించిన అరవింద్ అన్నదమ్ములు అవుతారు.

Brothers in telugu serial industry


You may also like