అంతకంటే మంచి ప్లేయర్స్ ని వదిలేసి… CSK యాజమాన్యం “మొయిన్ అలీ”నే ఎందుకు రిటైన్ చేసుకుందో తెలుసా.?

అంతకంటే మంచి ప్లేయర్స్ ని వదిలేసి… CSK యాజమాన్యం “మొయిన్ అలీ”నే ఎందుకు రిటైన్ చేసుకుందో తెలుసా.?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2022 వేలం జరిగింది. అన్నీ జట్లు తమ ప్లేయర్లని ప్రకటించారు. ఇందులో కొన్ని షాకింగ్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సీనియర్ ప్లేయర్లతో పాటు, కొంత మంది యువ ప్లేయర్లని కూడా ఎంపిక చేసారు.

Video Advertisement

ఇప్పుడు ఈ ఆక్షన్ ప్రక్రియపై చర్చలు జరుగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నలుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకుంది. వారు మహేంద్ర సింగ్ ధోని, ఋతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా. జడేజాని 16 కోట్లకి, ధోనీని 12 కోట్లకి, అలీని రూ.8 కోట్లకి,  గైక్వాడ్ ని రూ.6 కోట్లకి దక్కించుకున్నారు.

reason behind csk retaining moeen ali for ipl 2022

మొయిన్ అలీని రెటైన్ చేసుకోవడంపై, సీఎస్‎కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడారు. “రాబోయే ఐపీఎల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్‌ లతో కలిసి ఉండటానికి మొయిన్ అలీ ఆసక్తి చూపుతున్నారు” అని కాశీ విశ్వనాథన్ అన్నారు. వారు మొదట మొయిన్ తో మాట్లాడినప్పుడు, “ఈ ఆఫర్ నాకు నచ్చింది. వేరే ఫ్రాంచైజ్ గురించి ఆలోచించలేదు అని మొయిన్ తెలిపారు” అని కాశీ విశ్వనాథన్ అన్నారు. రుతురాజ్ విషయంలో కూడా అలాగే జరిగింది అని అన్నారు.

reason behind csk retaining moeen ali for ipl 2022

“మేము ఇండియాలో ఆడుతున్నప్పుడు అతను మాకు ఎంతో ప్రయోజనకరమైన ఆల్ రౌండర్ అవుతారు అని మాకు నమ్మకం ఉంది. మేము అతన్ని గత సంవత్సరం మాత్రమే రెటైన్ చేసుకున్నాం” అని కాశీ విశ్వనాథన్ అన్నారు. ధోనీ కూడా చెన్నైలో తన వీడ్కోలు ఆట ఆడాలి అని నిర్ణయించుకున్న తర్వాత మొత్తంలో కొంత తగ్గించుకున్నారు అని, అయితే ధోనీ సీజన్ మొత్తం ఆడతారా లేదా అనేది తెలీదు అని కాశీ విశ్వనాథన్ అన్నారు.


End of Article

You may also like