Ads
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఐపీఎల్-13 క్వాలిఫయర్-1 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 రన్స్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగుల స్కోర్ చేసింది .
Video Advertisement
అయితే నిన్నటి మ్యాచ్ లో చాలా మంది దృష్టి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యులు చేతికి వేసుకున్న బ్లాక్ కలర్ బ్యాండ్ పై పడింది. అసలు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యులు మాత్రమే బ్లాక్ కలర్ బ్యాండ్ వేసుకోవడానికి గల కారణం ఏమిటి? అనే ప్రశ్న అందరిలో నెలకొంది.
కానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతూ “ఫాస్ట్ బౌలర్ అయిన మోహిత్ శర్మ తండ్రి మోహన్ శర్మ చనిపోయారు అని, ఆయనకి ట్రిబ్యూట్ (నివాళి) గా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యులు అలా బ్లాక్ బ్యాండ్ వేసుకున్నారు అని” చెప్పారు కామెంటేటర్.
ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓడినప్పటికీ మరొక అవకాశం ఉంది. ఆర్సీబీ – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో ఢిల్లీ క్వాలిఫయర్-2 లో తలపడనుంది.
End of Article