Ads
2020 లో చాలా విషయాలు జరిగాయి. ఈ ఏడాది కరోనా బారిన పడి ఎంతో మంది తమ ప్రాణాలను విడిచారు, ఎన్నో సంవత్సరాలుగా మనల్ని అలరించిన ప్రముఖులు మనకి దూరం అయ్యారు. ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ప్రజల్లో డిప్రెషన్, ఆన్గ్జైటీ, ఇంకా మానసికంగా స్ట్రెస్ పెరిగింది. వీటన్నిటి నుంచి మనల్ని కొంచెం సేపు డైవర్ట్ చెయ్యడానికి, మన స్ట్రెస్ తగ్గించడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎన్నో షోస్, సినిమాలతో ఎంట్టైన్మెంట్ ఇస్తున్నాయి.
Video Advertisement
అంతే కాకుండా క్రికెట్ రంగం కూడా ఐపీఎల్ తో మన ముందుకి వచ్చింది. ఈ సంవత్సరం క్రికెట్ అభిమనులు కూడా అత్యంత నిరాశ కి గురయ్యారు. అందుకు కారణం క్రికెట్ దిగ్గజం ధోని రిటైర్మెంట్ ప్రకటించడం. వాళ్ళ అట తీరుతో మాత్రమే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా అభిమానులని సంపాదించుకున్న వారిలో ధోని ఒకరు. ధోని గురించి అన్ని విషయాలు క్రికెట్ అభిమానులు గమనిస్తూ ఉంటారు.
అలాగే మ్యాచ్ గెలవగానే ధోని ఒక వికెట్ ని పట్టుకొని రెస్ట్ రూమ్ కి వెళ్ళిపోతారు. అది కూడా మీరు గమనించే ఉంటారు. కానీ దీనికి కారణం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ధోని తను అలా చేయడానికి వెనుక ఉన్న కారణం గురించి ఒక సందర్భంలో చెప్పారు.
“టీమ్ మ్యాచ్ విన్ అవ్వగానే వికెట్ తీసుకోవడం నాకు అలవాటు. ఇది నేను కావాలని చేసేది కాదు. ఇది నా రిటైర్మెంట్ కి సంబంధించిన ఒక విషయం. మ్యాచ్ గెలిచిన ప్రతిసారి నేను ఒక వికెట్ తీసుకెళ్లి దాచుకుంటాను. రిటైర్ అయిన తర్వాత గెలిచిన పాత వీడియోలు చూస్తూ ఏ మ్యాచ్ లో గెలిచిన వికెట్ పై ఆ మ్యాచ్ వివరాలు రాసుకుంటా. ఫీల్డ్ లోని జ్ఞాపకాలని రిటైర్మెంట్ తర్వాత గుర్తు చేసుకుంటాను” అని పేర్కొన్నారు.
End of Article