Ads
మనకి క్రికెట్ అనేది ఒక ఎమోషన్. మనం టీమిండియా ఏదైనా మ్యాచ్ ఆడుతున్నప్పుడు మన జట్టు గెలవాలని కోరుకుంటాం. కానీ మిగిలిన దేశాలకు సంబంధించిన క్రికెట్ ప్లేయర్ లకి కూడా మన భారత దేశంలో చాలా క్రేజ్ ఉంది. వేరే దేశం ప్లేయర్లను కూడా మనం బాగా ఫాలో అవుతాం. వారిలో ఇయాన్ మోర్గాన్ కూడా ఒకరు. ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్ జట్టు క్రికెటర్. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడారు.
Video Advertisement
అయితే ఇటీవల ఒక మ్యాచ్ లో ఇయాన్ మోర్గాన్ కి సంబంధించిన విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదేంటంటే, ఇటీవల ఇండియాతో జరిగిన సిరీస్ లో ఇయాన్ మోర్గాన్ రెండు క్యాప్స్ పెట్టుకొని కనిపించారు. దీనికి కారణం చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఇయాన్ మోర్గాన్ ఇలా రెండు క్యాప్స్ పెట్టుకోవడానికి చాలా ముఖ్యమైన కారణమే ఉంది.
అదేంటంటే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఒకరి చేతి నుండి మరొకరి చేతికి ఒక వస్తువు ఇవ్వడానికి చాలా ఆలోచిస్తున్నాం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంది. ప్లేయర్స్ వారి వస్తువులని అంపైర్ కి ఇవ్వకూడదు అని ఆర్డర్ జారీ చేసింది ఐసీసీ. కానీ అదే బయో బబుల్ లో ఉన్న ప్లేయర్స్ కి వస్తువులను ఇవ్వచ్చు.
అందుకే ఒకే ఫీల్డ్ లో ఉన్న ప్లేయర్ బౌలింగ్ కి వెళ్ళినప్పుడు తమ క్యాప్ ని కెప్టెన్ అయిన ఇయాన్ మోర్గాన్ కి ఇచ్చి, ఓవర్ అయిపోయిన తర్వాత క్యాప్ మళ్ళీ తిరిగి తీసుకుంటారు. అందుకే ఇయాన్ మోర్గాన్ రెండు క్యాప్స్ తో కనిపిస్తారు. ఒక్క ఇయాన్ మోర్గాన్ మాత్రమే కాకుండా ఎంతో మంది ప్లేయర్లు ఈ రూల్ ఫాలో అవుతున్నారు.
End of Article