“రషీద్ ఖాన్” భార్య “అనుష్క శర్మ” అని గూగుల్ సెర్చ్ చూపించడం వెనక కారణం ఇదేనా.?

“రషీద్ ఖాన్” భార్య “అనుష్క శర్మ” అని గూగుల్ సెర్చ్ చూపించడం వెనక కారణం ఇదేనా.?

by Mohana Priya

Ads

సాధారణంగా గూగుల్ కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తూ ఉంటుంది. మనం ఒక విషయం అడిగితే, అది ఇంకొక విషయం డిస్ప్లే చేస్తూ ఉంటుంది. లేదా ఇన్ఫర్మేషన్ కూడా పొరపాటుగా ఇస్తూ ఉంటుంది. ఇందుకు ఉదాహరణ రషీద్ ఖాన్ కి సంబంధించిన ఒక సెర్చ్ ఇన్ఫర్మేషన్. గూగుల్ లో రషీద్ ఖాన్ వైఫ్ అని కొడితే అనుష్క శర్మ పేరు చూపిస్తోంది.

Video Advertisement

దీంతో సోషల్ మీడియా మొత్తం ఈ విషయం గురించి సరదాగా గూగుల్ పై ట్రోల్ల్స్ వస్తున్నాయి. అయితే ఇలా పొరపాటు జరగడానికి వెనకాల ఒక కారణం ఉందట. 2018 లో ఒక ఇంస్టాగ్రామ్ చాట్ సెషన్ లో రషీద్ ఖాన్ బాలీవుడ్ లో తనకు ఇష్టమైన హీరోయిన్లు ప్రీతి జింటా ఇంకా అనుష్క శర్మ అని చెప్పారట. ఈ కారణంగా రషీద్ ఖాన్ హెడ్ లైన్స్ లో ట్రెండ్ అయ్యారు. కాబట్టి ఇలా ఇన్ఫర్మేషన్ మిక్స్ అయ్యి ఉండొచ్చు.

ఏదేమైనా రషీద్ ఖాన్, అనుష్క శర్మ దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం రషీద్ ఖాన్ ఐపీఎల్ 2020 లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరపున ఆడుతున్నారు. అనుష్క శర్మ కూడా ప్రస్తుతం యూఏఈ లో ఉన్నారు.


End of Article

You may also like