Ads
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెస్ట్ టి 20 బౌలర్ లలో సౌత్ ఆఫ్రికన్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ఒకరు. కానీ ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఉన్న ఇమ్రాన్ తాహిర్ ఇప్పటి వరకు ఆడలేదు. ఇమ్రాన్ తాహిర్ గత ఐపీఎల్ సీజన్ లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో ఇమ్రాన్ తాహిర్ ఇంకా ఆడకపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న అందరిలో నెలకొంది.
Video Advertisement
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి, హైదరాబాద్ సన్ రైజర్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ సమయం లో మహేంద్ర సింగ్ ధోని ఈ విషయం గురించి మాట్లాడారు. “జగదీశన్ స్థానం లో పీయూష్ చావ్లా ఉన్నారు. ఇమ్రాన్ తాహిర్ గురించి మేము ఆలోచించాం. కానీ కాంబినేషన్ కుదరట్లేదు” అని అన్నారు.
తన ఐపీఎల్ డెబ్యూట్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన జగదీశన్ ను ఆట నుండి తప్పించారు. అల్ రౌండర్ సురేష్ రైనా కూడా ఈ సీజన్ లో లేరు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రైనా లేకపోవడంతో ధోనికి పెద్ద సమస్యే వచ్చింది. ఆ స్థానాన్ని భర్తీ చేసే భారత ఆటగాళ్లు ఎవరు టీం లో లేరు. కేదార్ జాదవ్, రితురాజ్ ఈ సీజన్ లో ఆకట్టుకోలేపోయారు. జగదీశన్ పరవాలేదు అనిపించారు. ఈ క్రమంలో విదేశీ బాట్స్మన్ పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది.
వాట్సన్, డుప్లెసిస్ ఓపెనర్స్ గా జట్టులో స్థిరంగా ఉన్నారు. ఈ క్రమంలో జట్టుకి ఆల్ రౌండర్స్ పై ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే సామ్ కర్రన్, బ్రావో లను జట్టులో ఉంచుతున్నారు. ఇద్దరు అటు బాల్ తోను, ఇటు బాట్ తోను సత్తా చాటారు. అందుకే ఇమ్రాన్ తాహిర్ ను జట్టులో ఉంచడానికి కాంబినేషన్ కుదరట్లేదు. పైగా లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ కూడా ఈ సీజన్లో పరవాలేదనిపించారు.
ఇలా ఉండగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ కి, ఇంకా హైదరాబాద్ సన్ రైజర్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడా తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.
End of Article