Ads
నవంబర్ 27 వ తేదీ నుండి ఆస్ట్రేలియాలో, టీం ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్ లను ఆడబోతోంది. భారత సెలెక్టర్లు 32 మంది ఉన్న మూడు జట్లను గత సోమవారం అనౌన్స్ చేశారు. కానీ అనౌన్స్ చేసిన జట్ల మెంబర్లలో రోహిత్ శర్మ పేరు లేదు. ఐపీఎల్ లో మ్యాచ్ ఆడుతున్నప్పుడు రోహిత్ శర్మకి తొడ కండరాలకు దెబ్బ తగలడంతో, తనని సెలెక్ట్ చేయలేదు అనే విషయం తెలుసుకొని అందరు డిసప్పాయింట్ అయ్యారు.
Video Advertisement
కానీ ఈ అనౌన్స్మెంట్ జరిగిన కొంచెం సేపటికే నెట్స్ లో బాల్ ని ముందు లాగానే హిట్ చేస్తూ కనిపించారు రోహిత్ శర్మ. అసలు దెబ్బ తగిలితే ఇలా ఎలా ప్రాక్టీస్ చేయగలుగుతారు? అనే ప్రశ్న అందరిలో నెలకొంది.సునీల్ గవాస్కర్ కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వమని భారత సెలెక్టర్లను అడిగారు. చర్చ ఎక్కువ అవ్వడంతో అసలు విషయం ఏంటి అని భారత సెలెక్టర్లు ఈ విషయం గురించి ఆరా తీశారు. ఇందులో తెలిసింది ఏంటంటే.
4️⃣5️⃣ seconds of RO 4️⃣5️⃣ in full flow!🔥#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @ImRo45 pic.twitter.com/65ajVQcEKc
— Mumbai Indians (@mipaltan) October 26, 2020
ప్లేయర్స్ ని ఎంపిక చేసే ముందు భారత సెలెక్టర్లు ప్లేయర్స్ యొక్క ఫిట్ నెస్ రిపోర్ట్ ని ఇవ్వమని టీం ఇండియా ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ని ఆదేశించారు. రోహిత్ శర్మ రిపోర్ట్ లో రెండు – మూడు వారాల రెస్ట్ అవసరం అని రాశారు. అందుకే భారత సెలెక్టర్లు రోహిత్ శర్మ పేరుని కన్సిడర్ చేయలేదు.
ఈ విషయంపై బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ ప్లేయర్స్ పూర్తి రిపోర్ట్ ని నితిన్ పటేల్ భారత సెలెక్టర్లకు ఇచ్చారని, సాధారణంగా టీం ఎంపికకి ముందు సెలెక్టర్లకు ఈ రిపోర్ట్ ఇస్తుంటారు అని, రోహిత్ శర్మ గాయంపై ఇద్దరు డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్ ని ఫిజియోథెరపిస్ట్ సమర్పించారు అని, అందులో ఇద్దరు డాక్టర్లు కూడా రోహిత్ శర్మ కి రెండు – మూడు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు అని, అందుకే భారత సెలెక్టర్లు రోహిత్ శర్మ ని సెలెక్ట్ చేయలేదు అని అన్నారు.
End of Article