నిన్నటి DC vs Kxip మ్యాచ్ లో ప్లేయర్స్ రెండు క్యాప్ లు ఎందుకు పెట్టుకున్నారు.? అసలు కారణం ఇదే.!

నిన్నటి DC vs Kxip మ్యాచ్ లో ప్లేయర్స్ రెండు క్యాప్ లు ఎందుకు పెట్టుకున్నారు.? అసలు కారణం ఇదే.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోర్ చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 167/5 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడా తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది.

Video Advertisement

అయితే మనలో కొంత మంది అయినా మ్యాచ్ లో ఒక విషయం అబ్జర్వ్ చేసి ఉంటాం. అదేంటంటే కొంత మంది ప్లేయర్స్ రెండు క్యాప్స్ పెట్టుకొని కనిపించారు. ఈ విషయం అందరూ కాకపోయినా కొంతమంది అయినా గమనించే ఉంటారు. దాని వెనక ఒక కారణం ఉంది. అదేంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొన్ని హెల్త్ గైడ్ లైన్స్ జారీ చేసింది. అందులో ప్లేయర్స్ యొక్క వస్తువులు ఆన్ ఫీల్డ్ అంపైర్స్ క్యారీ చేయకూడదు అని ఒక రూల్ మెన్షన్ చేశారు.

సాధారణంగా ఆన్ ఫీల్డ్ అంపైర్స్ ప్లేయర్ యొక్క క్యాప్స్, ఓవర్ కోట్, లాంటివి క్యారీ చేసేవారు. కానీ బయో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ దృష్ట్యా ఈసారి దాన్ని నిషేధించారు. ఈ కారణంగా ప్లేయర్ తన క్యాప్ ఇంకా ఇతర వస్తువులను కూడా అంపైర్ కి ఇవ్వకూడదు. అందుకే ఒక ప్లేయర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు తన తోటి ప్లేయర్ అతని క్యాప్ ని తీసుకుంటారు. అందుకే కొంతమంది ప్లేయర్లు అందులోనూ ముఖ్యంగా కెప్టెన్స్ ఒకటి కంటే ఎక్కువ క్యాప్స్ పెట్టుకొని కనిపిస్తున్నారు.


End of Article

You may also like