ఎయిర్‌పోర్టుకు లేట్ గా వెళ్లడం వలెనే షిమ్రాన్ హెట్మేయర్ ఆటకు దూరమయ్యాడు అని అంతా అంటున్నారు. అసలు నిజంగా షిమ్రాన్ హెట్మేయర్ ఆటకు దూరం అవ్వడానికి కారణం ఎయిర్‌పోర్టుకు లేట్ గా వెళ్లడం ఏనా.? అందుకే వెస్టిండీస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్మేయర్ టీ20 వరల్డ్ కప్‌ లో ఆడడం లేదా..? అయితే అసలు కారణం ఇదేనట.

Video Advertisement

మరి వివరాలను చూస్తే.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్మేయర్ టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికయ్యాడు. కానీ ఫ్లైట్ మిస్ అయ్యాడు. ఆస్ట్రేలియాకు శనివారమే హెట్మేయర్ వెళ్ళాలి కానీ ఫ్యామిలీ వలన తన ప్రయాణం వాయిదా వేసుకున్నాడట. అయితే ఇతను వచ్చెనందుకు సోమవారం గయానా టు ఆస్ట్రేలియా వెళ్లే ఫ్లైట్ కి ఓ టికెట్ ని ఎంతో కష్టపడి బుక్ చేశారట.

కానీ ఈ ఆటగాడు టైం కి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళలేదు. దీంతో ఫ్లైట్ మిస్ అయ్యాడు. వెస్టిండీస్ క్రికెట్ డైరెక్టర్ జిమ్మీ ఆడామ్స్‌ కూడా ఇలానే చెప్పారు. టైం కి ఎయిర్ పోర్ట్ కి వెళ్ల లేదని అందుకే ఫ్లైట్ మిస్ అయ్యాడని అన్నారు. ఈ స్థానం లో షమరా బ్రూక్స్‌ను ఎంపిక చేసారు. దానితో షమరా బ్రూక్స్‌ టీ20 వరల్డ్ కప్ లో ఆడుతున్నాడు. సెలక్షన్ కమిటీ ఏ షమరా బ్రూక్స్‌ ని ఎంపిక చేసింది.

hetmeyer

ఈ సమాచారంని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఐసీసీకి చెప్పేసారు. పైగా హెట్మేయర్ కి టికెట్ బుక్ చేసినప్పుడే ఆలస్యం అయితే కనుక జట్టులో మరొకరిని పెడతాం అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చెప్పిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే ఒక నెటిజన్ అసలు విషయం ఇదే అంటూ చెప్పారు. ఇదిలా ఉంటే పూర్తైన కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ లో షమరా అద్భుతమైన ఆటను ఆడాడు. అందరినీ షమరా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టేసుకున్నాడు. వెస్టిండీస్ క్రికెట్ డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాకు పంపిస్తామని అన్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 17న వెస్ట్ ఇండీస్ స్కాట్లాండ్‌ తో ఆడనుంది.