ముంబైతో మ్యాచ్‌లో ధోని “స్ట్రాటజీ” చూసారా.? “మాస్టర్ మైండ్” అనేది ఇందుకే…!

ముంబైతో మ్యాచ్‌లో ధోని “స్ట్రాటజీ” చూసారా.? “మాస్టర్ మైండ్” అనేది ఇందుకే…!

by Sunku Sravan

Ads

మహేంద్రసింగ్ ధోని క్రికెట్ ఆట లోనే ఒక స్టార్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నారు. సమయానికి ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన ఆటగాడు. అందుకే ఆయన క్రికెట్ లో దిగ్గజ ప్లేయర్ గా ఎదిగాడు. గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఫీల్డర్లను ఎలా సెట్ చేయాలి, ఏ బౌలర్ ను ఏ సమయంలో వాడాలి, ఎవరి బౌలింగులో ఏ బ్యాటరును పెడితే బాగుంటుంది అనే మెళకువలు తెలిసిన ప్లేయర్.

Video Advertisement

అందుకే ఈయనను మాస్టర్ మైండ్ అని అంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో సిఎస్ కే జట్టుకు రవీంద్ర జడేజా పేరుకు మాత్రమే కెప్టెన్. కానీ అన్నీ చూసుకోవడంలో వ్యూహాలను రచించేది ధోనీ.

కొన్ని రోజుల కింద చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా, ధోని డీప్ స్కైరు లెగ్ లో ఫీల్డర్లను సెట్ చేసి అతడు వికెట్ ను సాధిస్తాడు. ఇలా అంతకుముందు బంతి పడేవరకు ఫీల్డర్స్ అంత స్కైరు లెగ్ లో ఉంటారు..

కానీ సరిగ్గా బంతి పడే టైంలో డీప్ స్కైరు లెగ్ లోనికి రావలసిందిగా.. ఆ ఫీల్డర్లకు ధోని సైగ చేస్తాడు. దీంతో విరాట్ కోహ్లి నేరుగా అతనికి క్యాచ్ ఇచ్చేసి ఫెవిలియంకు చేరుకుంటాడు. అయితే తాజాగా ఇలాంటి సంఘటన ఐపీఎల్ లో మరోసారి చోటు చేసుకుంది. ఈసారి ధోని ఫీల్డర్లను సెట్ చేయడంతో పాటుగా ఫోలార్డ్ ఈగోతో కూడా ధోని ఆడేసుకున్నాడు.

ముంబై బ్యాటింగ్ చేస్తుండగా.. మహిష్ తిక్షణ వేసినటువంటి బౌలింగులో బౌలర్ నెత్తి మీదికి సిక్సర్లు బాదాడు. అయితే పోలార్డ్ ఎక్కువగా స్ట్రైట్ గా కొడుతుంటాడు. దీంతో పోలార్డ్ ను ఎలాగైనా అవుట్ చేయడం కోసం, ధోని రంగంలోకి దిగి మాస్టర్ ప్లాన్వేశాడు.

కానీ అతని లెక్క తప్పింది నేరుగా ఫిల్డర్ చేతిలోకి వెళ్ళింది. ఇలా ధోని వలలో పడటం పోలార్డ్ కి ఇదేమీ కొత్త కాదు. 2010లో కూడా ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ధోని పొలార్డ్ కోసం ఈ విధంగానే ఫీల్డింగ్ సెట్ చేసారు. లాంగ్ గాప్ లో రైనాను ఉంచిన ధోని.. అలాగే సర్కిల్ లోపల స్ట్రైట్ గా హెడేన్ ను ఉంచారు. ఇందులో మోర్కెల్ బౌలింగ్ చేస్తుండగా స్ట్రైట్ గా ఆడబోయిన పోలార్డ్ హెడెన్ చేతికి చిక్కారు.

ఆ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. అయితే ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ రెండిటిని పోలుస్తూ నెట్టింట్లో ధోని మాస్టర్ మైండ్ పైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్ లో కూడా ముంబై జట్టు ఓడిపోయిందని, దీంతో ఆడిన ఏడు మ్యాచ్ ల్లో ముంబై ఓడిపోయి.. ప్లే ఆప్ కు దూరమైంది.

 

 


End of Article

You may also like