సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో “వెంకటేష్ అయ్యర్” కి “కేఎల్ రాహుల్” బౌలింగ్ ఇవ్వకపోవడానికి కారణం ఇదేనా.?

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో “వెంకటేష్ అయ్యర్” కి “కేఎల్ రాహుల్” బౌలింగ్ ఇవ్వకపోవడానికి కారణం ఇదేనా.?

by Mohana Priya

Ads

సౌతాఫ్రికాతో బుధవారం రోజు జరిగిన మొదటి వన్డేలో ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకున్న వెంకటేశ్ అయ్యర్‌తో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్ చేయించకపోవడం చర్చలకు దారి తీసింది.

Video Advertisement

మ్యాచ్ కి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బౌలింగ్ ఆప్షన్ గురించి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ మొదటి వన్డే ఆప్షన్ కోసం వెంకటేష్ అయ్యర్ ని జట్టులోకి తీసుకున్నారు అని అన్నారు. కానీ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించకపోవడంతో రాహుల్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వెంకటేష్ అయ్యర్ కి టీమ్ ఇండియా తరఫున ఇదే మొదటి వన్డే. ఈ విషయంపై శిఖర్ ధావన్ మాట్లాడుతూ ఈ విధంగా తెలిపారు.

reason behind why venkatesh iyer didnt bowled a single over in ind vs sa 1st odi

“మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. పిచ్ నుండి స్పిన్నర్లకి మంచి సహకారం లభించింది. దాంతో మిడిల్ ఓవర్లలో వారితోనే ఎక్కువగా బౌలింగ్ చేయించాం. జట్టుకి కొన్ని ఓవర్ల పాటు వికెట్ లభించలేని కారణంగా బ్రేక్ త్రూ కోసం ప్రయత్నం చేశాం. దాంతో ప్రధాన బౌలర్లతోనే బౌలింగ్ చేయించాం. కానీ ఫలితం అనుకున్న విధంగా రాలేదు. చివరికి మెయిన్ బౌలర్లు, స్పిన్నర్లని ఎలా ఉపయోగించుకున్నాం అనేది మాత్రమే ముఖ్యం.” అని అన్నారు.

reason behind why venkatesh iyer didnt bowled a single over in ind vs sa 1st odi

సౌతాఫ్రికా జట్టులో కెప్టెన్ తెంబ బవుమా (110: 143 బంతుల్లో 8×4), దుస్సేన్ (129 నాటౌట్: 96 బంతుల్లో 9×4, 4×6) మిడిల్ ఓవర్లలో నాలుగో వికెట్‌కి 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరిని విడదీసేందుకు కేఎల్ రాహుల్ ఐదుగురు బౌలర్లని మార్చారు. కానీ సిక్స్ ఆప్షన్ గా ఉన్న వెంకటేష్ అయ్యర్ తో మాత్రం ఒక్క ఓవర్ కూడా వేయలేదు. శార్దూల్ ఠాకూర్ 10 ఓవర్లు వేసి, 72 పరుగులు చేసి కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దాంతో శార్దూల్ ఠాకూర్ ని తప్పించి కనీసం వెంకటేష్ అయ్యర్ తో నాలుగైదు ఓవర్లు వేయించి ఉండాల్సింది అని మాజీ క్రికెటర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


End of Article

You may also like