Ads
ఐపీఎల్ 2024 లో చెన్నై వేదికగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో, 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మీద విజయం సాధించింది. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఇది మొదటి ఓటమి. మ్యాచ్ అయిపోయాక, ఈ విషయం మీద చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడారు. “ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఇది ఒక మంచి మ్యాచ్. లక్నో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. 13-14 ఓవర్ల వరకు మా చేతుల్లో ఉంది. స్టోయినీస్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు”.
Video Advertisement
డ్యూ (తేమ) కూడా ఈ మ్యాచ్ లో ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఇది ఎక్కువగా ఉండడం వల్లే మా స్పిన్నర్లు సరిగ్గా ఆడలేకపోయారు. అయినా కూడా మా పేసర్లు మ్యాచ్ ని చివరి వరకు తీసుకెళ్లడానికి కృషి చేశారు. ఓటమి అనేది ఆటలో ఎక్కడైనా సహజం. పవర్ ప్లే లో రెండవ వికెట్ కోల్పోయిన కారణంగానే జడేజాని నాలుగవ స్థానంలో పంపించాం. పవర్ ప్లే తర్వాత శివమ్ దూబేని బ్యాటింగ్ కి పంపించాలి అనుకున్నాం. ఒక విషయం నిజంగా చెప్పాలంటే, ఈ వికెట్ మీద మేము ఇచ్చిన లక్ష్యం సరైనది కాదు. తేమ ఉన్నప్పుడు ఇంకా కొన్ని పరుగులు చేయాల్సిన అవసరం ఉంది.”
“లక్నో బ్యాటింగ్ చాలా బాగా చేసింది” అంటూ మాట్లాడారు. రుతురాజ్ చెప్పినట్టు తేమ అనేది ఈ మ్యాచ్ లో ముఖ్య పాత్ర పోషించింది. డ్యూ ఫాక్టర్ వల్ల లక్నో జట్టు రెండవ ఇన్నింగ్స్ లో పరుగులు సులభంగా స్కోర్ చేయగలిగింది. చెన్నై జట్టు ఇది దృష్టిలో పెట్టుకొని లక్ష్యాన్ని ఇంకా కొంచెం ఎక్కువగా ఇస్తే బాగుండేది. అంతే కాకుండా చివరిలో దీపక్ చాహర్ మిస్ ఫీల్డ్ కూడా టీంకి భారంగా మారాయి. ఇవన్నీ కలిపి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమికి కారణాలు అయ్యాయి.
ALSO READ : ఇప్పటివరకు 6 ఐపీఎల్ టీములు మారాడు…ఇప్పుడు డబల్ సెంచరీతో అందరికి షాక్ ఇచ్చిన ఈ ప్లేయర్ ఎవరంటే.?
End of Article