Ads
భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టు ఇంగ్లాండ్ పైన ఐదు టెస్టులు సీరీస్ ను ఆడుతుంది. సిరీస్ లో మొదటి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరిగింది. అయితే మ్యాచ్ ఆద్యంతం భారత జట్టుకు అనుకూలంగానే ఉన్న చివరికి వచ్చేసరికి తిరిగిపోయింది. భారత్ ను ఓడించి ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ కైవసం చేసుకుంది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత్ ఇంగ్లాండ్ స్పిన్నర్లు దాటికి నిలవలేక 202 పరుగుల కి కుప్పకూలింది.
Video Advertisement
నాలుగు రోజులు కొనసాగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదటి రెండు రోజులు భారత్ జట్టు ఆధిపత్యం కొనసాగింది. బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను మంచి ప్రదర్శన కొనసాగించింది. అయితే ఆఖరి రెండు రోజులు మాత్రం పేలవమైన బ్యాటింగ్, ఫీల్డింగ్ తో నిరాశపరిచింది. అయితే గెలుపు అంచులు దాకా వెళ్ళిన మ్యాచ్ లో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే అంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
1. పేలవమైన బ్యాటింగ్:
231 పరుగుల తక్కువ స్కోరును చెందించడానికి భారత జట్టు బ్యాటింగ్ కి దిగింది.ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ లు విఫలమవ్వగా, శుభ్‌మన్ గిల్ సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. అతని వైఫల్యం మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో తర్వాత వచ్చిన భారత బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది.ఇదే ఇంగ్లండ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచి మ్యాచ్ ను చేజార్చుకుంది.
2. చెత్త ఫీల్డింగ్:
ఈ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్ళు చెత్త ఫీల్డింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్స్ కి అవకాశాలు కల్పించారు. చేతుల్లోకి వచ్చిన క్యాచ్లు వదిలేయడం, సునాయసమైన బౌండరీలను ఆపలేకపోవడం వంటి తప్పిదాలుతో భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఏకంగా 10 బౌండరీలు వదిలేసారు అంటే అర్థం చేసుకోవచ్చు.
3. ఫలించని ప్రయోగం:
అక్షర పటేల్ ను ముందు ఆర్డర్ లో పంపిస్తు చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. నాలుగో స్థానంలో ఆడిన అక్షర ఎక్కువసేపు నిలవలేకపోయాడు. లోయర్ ఆర్డర్ లో వచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేది అని అంటున్నారు.కేఎస్ భరత్, అశ్విన్‌లతో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పేవాడు. భారత విజయానికి కృషి చేసేవాడు.
End of Article