CSK Vs GT : ఈ 3 కారణాల వల్లే… “గుజరాత్ టైటాన్స్” ఓడిపోయిందా..?

CSK Vs GT : ఈ 3 కారణాల వల్లే… “గుజరాత్ టైటాన్స్” ఓడిపోయిందా..?

by kavitha

Ads

ఐపీఎల్ 16 వ సీజన్లో పాయింట్లలో టాప్ ప్లేసె లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు తాజాగా చెెన్నై సూపర్ కింగ్స్‌ తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు చేసిన మూడు తప్పిదాల వల్ల ఓటమిని చవి చూసింది. ఐపీఎల్ 2023 లో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ జట్టు పై గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.

Video Advertisement

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 రన్స్ చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 157 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ గెలుపుతో చెన్నై జట్టు ఫైనల్ కి వెళ్ళింది. గుజరాత్ ఓటమికి కారణాలేంటో ఇప్పుడు  చూద్దాం..
1. నోబాల్: 

గుజరాత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలర్ దర్శన్ నాల్కండ్ వేసిన రెండో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్‌ ఔట్ అయ్యేవాడు. కానీ ఆ ఓవర్ మూడో బాల్ కి నాల్కండ్ లెంగ్త్ బాల్ వేయడంతో రుతురాజ్ షాట్ కొట్టగా బంతి గాల్లోకి లేచింది. దాన్ని శుభ్‌మన్ గిల్ పట్టుకున్నాడు. వికెట్ తీశామని గుజరాత్ ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ  నాల్కండే క్రీజ్ బయట పాదం పెట్టి బాల్ వేయడంతో దాన్ని నోబాల్‌గా అంపైర్ ప్రకటించాడు. రుతురాజ్‌కు 2 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుండి బయటపడి 44 బాల్స్ లో 60 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అది నోబాల్ కానట్లయితే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.
2. 26 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు: 

చెన్నై జట్టు ఇచ్చిన 172 పరుగుల లక్ష్యం ప్లేఆఫ్స్ దశలో అంత సులభం కాదు. మొదటి నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తే టార్గెట్ ను చేధించే ఛాన్స్ ఉంటుంది. అయితే పవర్ ప్లేలోనే గుజరాత్ జట్టులో సాహా, హార్దిక్ పాండ్య వికెట్లను చేజార్చుకుంది. ఇక 26 రన్స్ వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోవడం గుజరాత్‌‌ జట్టు ఓటమికి కారణం అయ్యింది.
3. జట్టు ఎంపిక:

గుజరాత్ జట్టు క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం ఎన్నుకున్న జట్టులో మార్పు చేసింది. అదే యష్ దయాల్ ప్లేస్ లో దర్శన్ నాల్కండే‌ను తీసుకుంది. అయితే నాల్కండే‌ ఈ సీజన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదే మొదటి ఐపీఎల్ మ్యాచ్. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్ లో లోకల్ ఆటగాళ్లు అయిన సాయి సుదర్శన్, సాయి కిషోర్‌లకు ఛాన్స్ ఇవ్వలేదు.
నోబాల్ వేసి నాల్కండే 4 ఓవర్లలో 44 రన్స్ ఇచ్చి కేవలం ఒక వికెట్ తీశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చింది కూడా నాల్కండేనే. సాయి సుదర్శన్‌ను ఈ మ్యాచ్ లో ఆడితే అతని స్పిన్ గుజరాత్ జట్టుకు  పనికొచ్చేది. అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పులు కూడా గుజరాత్‌ ఓటమికి కారణం అయ్యాయి.

Also Read: CSK VS GT IPL 2023 క్వాలిఫైయర్ మ్యాచ్‌లో… డాట్ బాల్‌కి చెట్టుని ఎందుకు చూపిస్తున్నారో తెలుసా? కారణం ఇదే.!


End of Article

You may also like