FIR Rules: FIRలో రాసిన పేర్లను తీసేసి.. కొత్త పేర్లు రాసే వారికి ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసా..?

FIR Rules: FIRలో రాసిన పేర్లను తీసేసి.. కొత్త పేర్లు రాసే వారికి ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసా..?

by Megha Varna

Ads

ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేస్తారు. అయితే సెక్షన్ 154 ప్రకారం మనం ఇచ్చిన కంప్లైంట్ మొదలవుతుంది మరియు చివరగా సెక్షన్ 173 తో ముగిస్తుంది.

Video Advertisement

 

సెక్షన్ 173 చార్జిషీట్ కు సంబంధించింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం దీనిని తయారు చేస్తారు. ఈ రెండు సెక్షన్ల మధ్యలో కేసుకు సంబంధించి ఎన్నో సెక్షన్లు ఉంటాయి. ఎఫ్ఐఆర్ కు సంబంధించి సరైన రూల్స్ పాటించకపోవడం వలన సంవత్సరానికి వందలాది కేసులు సుప్రీంకోర్టుకి వెళ్తాయి.

Your right is to register an FIR, know what is the difference between FIR and NCR | by Y.R. Advocate Associates | Medium

సహజంగా ఎఫ్ఐఆర్ కు సంబంధించి ఈ రూల్స్ ని పాటించరు. ఎంట్రీను ఆలస్యంగా రాయడం, ఎఫ్ఐఆర్ లో ముందు నమోదు చేసిన పేర్లకు మరికొందరి పేర్లని జోడించడం, ఫిర్యాదులు వేసిన వ్యక్తుల నుండి మరొక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం వంటివి ఎన్నో జరుగుతాయి.

కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేసిన వెంటనే ఎటువంటి విచారణ జరపకుండా కొన్ని కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగేది. అయితే సుప్రీం కోర్ట్ కి అటువంటి కేసులు ఎన్నో వచ్చాయి. వాటిని ఆధారంగా తీసుకుని సుప్రీంకోర్టు ప్రజలకు మరియు పోలీసులకు గైడ్ లైన్స్ ను ఇవ్వడం జరిగింది.

అందువల్ల ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వెంటనే పోలీసులు ముందుగా విచారణ జరపాలి, సరైన ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయాలి. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మినిమమ్ ఇన్ఫర్మేషన్, స్టేట్మెంట్స్ వంటివి ఏమి సంపాదించుకుండా అరెస్ట్ చేయకూడదు. అదే విధంగా డబ్బులు కోసం ఎఫ్ఐఆర్ లో ఉండే పేర్లను మార్చకూడదు. ఇది చట్టరీత్యా నేరం, ఇలా చేస్తున్న వారందరికీ చట్టప్రకారం శిక్ష కూడా ఉంటుంది.


End of Article

You may also like