RINKU SING: 6 కొట్టినందుకు సారీ చెప్పిన రింకు సింగ్..ఎందుకంటే.?

RINKU SING: 6 కొట్టినందుకు సారీ చెప్పిన రింకు సింగ్..ఎందుకంటే.?

by Mounika Singaluri

Ads

రింకు సింగ్ ఇప్పుడు ఈ పేరు టీమిండియా లో మారుమోగిపోతుంది. తన డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్ తో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. టీమిండియా కి ధోని తర్వాత సరైన ఫినిషర్ లేడు అని బాధపడుతున్న వారికి రింకు సింగ్ రూపంలో సమాధానం దొరికింది. బ్యాటింగ్ కి ఎప్పుడు వచ్చినా కూడా హిట్టింగ్ ఆడుతూ ఫినిషర్ అవతారం ఎత్తుతున్నాడు. మొన్న ఆస్ట్రేలియా తో జరిగిన టి20 సిరీస్ లో కూడా రింకు సింగ్ ప్రతి మ్యాచ్ లోనూ తన అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు.

Video Advertisement

తాజాగా డిసెంబర్ 12 తారీఖున సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 మ్యాచ్ లో మళ్లీ తన ప్రతాపాన్ని చూపించాడు రింకు సింగ్. 19వ ఓవర్ లో మాక్రం బౌలింగ్ లో రెండు సిక్సులు బాదాడు. అందులో ఒక సిక్స్ వెళ్లి మీడియా బాక్స్ అద్దానికి తగిలి అది పగిలిపోయింది. ఈ సీన్ చూసినా ఎవ్వరికైనా సరే రింకు సింగ్ ఎంతగా చెలరేగిపోతున్నాడో అర్ధం అవుతుంది. అది కాకుండా ఈ మ్యాచ్ లో 39 బాల్స్ ఆడి 69 పరుగులు చేశాడు.

రింకు సింగ్ ఇదేవిధంగా పెర్ఫామ్ చేస్తే రాబోయే టీ20 ప్రపంచ కప్ లో అతడికి బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. కీలక సమయాల్లో ఒత్తిడికి గురవకుండా ఫినిషర్ పాత్రను బాగా పోషిస్తున్నాడు. ఒకప్పుడు ధోని ఇదేవిధంగా ఆడేవాడు. అభిమానులందరూ ధోనీకి తగ్గ వారసుడు వచ్చాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రింగ్ కోసం మీడియా బాక్స్ బద్దలు కొట్టినందుకు సారీ చెప్పుకొచ్చాడు. భారత్ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు బ్యాటింగ్ కి వచ్చాను… భారీ సిక్స్ ఆడినప్పుడు అద్దం పగిలిపోయింది అందుకు సారీ చెబుతున్నా అంటూ పోస్ట్ పెట్టాడు.


End of Article

You may also like