రోహిత్‌ శర్మ తమ్ముడు ఎవరు? అతను ఎలాంటి జీవితం గడుపుతున్నాడో తెలుసా..?

రోహిత్‌ శర్మ తమ్ముడు ఎవరు? అతను ఎలాంటి జీవితం గడుపుతున్నాడో తెలుసా..?

by kavitha

Ads

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ ఫ్యామిలీ నుండి  వచ్చిన రోహిత్ శర్మ భారత జట్టుకు సారధి అయ్యే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం కోట్ల రూపాయలు సంపాదిస్తూ, లగ్జరీ జీవితాన్ని ​ గడుపుతున్నారు.

Video Advertisement

అయితే రోహిత్ శర్మ వ్యక్తిగత విషయాల గురించి అంతగా బయటికి చెప్పారు.  రోహిత్ కి సొంత తమ్ముడు ఉన్నారు. అయితే ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. హిట్​మ్యాన్ తమ్ముడు ఏం చేస్తున్నాడు? అతను ఎలాంటి జీవితం గడుపుతున్నాడో  ఇప్పుడు చూద్దాం..
రోహిత్ శర్మ మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని బన్సోడ్‌లో 1987 ఏప్రిల్ 30న జన్మించారు. తండ్రి గురునాథ్ శర్మ, తల్లి పూర్ణిమ శర్మ. తల్లి విశాఖపట్నంకు చెందిన వారు. రోహిత్ తరువాత మరో కొడుకు జన్మించాడు. అతని పేరు విశాల్ శర్మ.  తండ్రి రవాణా సంస్థ స్టోర్‌హౌస్‌లో కేర్‌టేకర్‌గా చేసేవారు. అయితే శర్మ తండ్రికి ఆదాయం తక్కువకావడంతో శర్మ బోరివలిలో ఉన్న తాత, మేనమామల దగ్గర పెరిగారు. వారాంతాలలో మాత్రమే డోంబివిలిలోని ఒకే గది ఉన్న ఇంట్లో నివసించే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేవాడు.
ఆ సమయంలోనే విశాల్‌తో ఆడుకునేవాడు. అన్నదమ్ములిద్దరు క్రికెట్‌ ఆడేవారు. ఈ క్రమంలో రోహిత్‌ టాలెంట్ చూసిన అతని అంకుల్‌ రోహిత్‌ పేరును క్రికెట్‌ క్యాంపులో రిజిస్టర్ చేయించాడు. అలా 14ఏళ్ళకే క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్‌ శర్మ తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ  ‘హిట్‌మ్యాన్‌’ పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో టీమిండియా కీలక ఆటగాడిగా ఉన్న రోహిత్ ప్రస్తుతం కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
ముంబైలో భార్యా, కుమార్తెతో లగ్జరీ ప్రాంతంలో నివసిస్తున్న రోహిత్‌, తల్లిదండ్రులు మరియు సోదరుడి కోసం వారింటి కొంచెం దూరంలో మరోక గృహాన్ని కొనుగోలు చేశాడు.ఇంటికి పెద్ద కుమారుడిగా ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటున్నాడు. తమ్ముడు విశాల్‌కు అండగా నిలిచాడు. ఎక్కడో జాబ్ వెతుక్కోవాల్సిన పని లేకుండా తాను ప్రారంభించిన క్రికెట్‌ అకాడమీలను చూసుకునే బాధ్యతను విశాల్‌కు అప్పగించాడు. ప్రస్తుతం విశాల్‌ శర్మ భారత్, సింగపూర్‌లలోని రోహిత్‌ క్రికెట్‌ అకాడమీలకు ఆపరేషన్స్‌ హెడ్‌గా పనిచేస్తున్నాడు.

Also Read: విరాట్ కోహ్లీ ఫ్యామిలీ గురించి మీకు తెలుసా.? ఆయన అన్నా వదినను ఎప్పుడైనా చూసారా…?

 


End of Article

You may also like