Ads
సెలబ్రెటీల ప్రేమకథలు తెలుసుకోవడానికి సామాన్యుల నుండి వారి అభిమానుల వరకు ఆసక్తి చూపిస్తారు. ప్రేమ వివాహం చేసుకున్న భారత స్టార్ క్రికెటర్లలో రోహత్ శర్మ కూడా ఒకరు. స్పోర్ట్స్ మేనజర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Video Advertisement
రోహత్ శర్మ వివాహం డిసెంబర్ 13న జరిగింది. పెళ్లిరోజు నేపథ్యంలో రోహత్ లవ్ స్టోరీ, పెళ్లి గురించి, రోహిత్ శర్మకు యువరాజ్ సింగ్ ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హిట్‌మ్యాన్ రోహత్ శర్మ ప్రేమ కథ గురించి ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరియు రోహిత్ శర్మ 2008లో ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ షూట్‌కు యువరాజ్ మేనేజర్ రితికా సజ్దే కూడా వచ్చారు. రీతికను యువరాజ్ సోదరిగా భావిస్తాడు. అందువల్ల రోహిత్ షూట్ కోసం రాగానే రితికను చూపిస్తూ, ఆమె స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్ అని, ఆమెకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడు. ఆశ్చర్యపోయిన రోహిత్ ఆమెతో నాకేం పని? ఇక్కడికి షూటింగ్‌లో పాల్గొనడానికి వచ్చానని స్ట్రాంగ్ గా చెప్పాడు. అయితే మరోసారి షూట్ లో కలిసినపుడు రితిక ప్రవర్తించిన విధానానికి రోహిత్ ఫ్లాట్ అయ్యాడు.
అలా వారిద్దరి మధ్య మాటలు ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత రోహిత్ శర్మకు రితిక మేనేజర్ అయ్యింది. ఇలా మొదలైన వారి ప్రయాణం, ప్రేమ, డేటింగ్ వరకు సాగి, పెద్దల అంగీకారంతో 2015లో జూన్ 3న కుటుంబ సభ్యుల సమక్షంలో రోహిత్, రితిక ల ఎంగేజ్మెంట్ జరుగగా, డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు.
అయితే పెళ్లికి ముందు డేటింగ్ చేసిన విషయాన్ని ఇద్దరు చాలా రహస్యంగా ఉంచారు. వీరిద్దరూ తమ వివాహ బంధానికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తమ ప్రేమను తెలుపుతూ సోషల్ మీడియాలో అందమైన ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ జంటకి 2018లో డిసెంబరు 30న కుమార్తె జన్మించింది.
Also Read: KALASHA REVIEW : భానుశ్రీ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే..?
End of Article