సచిన్ టెండూల్కర్ ఇండియా జట్టు తరుపున ఆడక ముందు ఏ దేశ టీం లో ఆడాడో తెలుసా..?

సచిన్ టెండూల్కర్ ఇండియా జట్టు తరుపున ఆడక ముందు ఏ దేశ టీం లో ఆడాడో తెలుసా..?

by Megha Varna

Ads

సచిన్ టెండూల్కర్ గురించి మనం కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. టెండూల్కర్ చాలా ఫేమస్ క్రికెటర్. తన ఆటతో భారతదేశంలో ఎంతో మంది మనసుల్ని దోచుకున్నాడు టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ కి భారతరత్న ని కూడా ఇచ్చి గౌరవించారు. పైగా ఈ అవార్డును పొందిన ప్రధమ క్రీడాకారుడిగా మరో రికార్డు నెలకొల్పాడు టెండూల్కర్.

Video Advertisement

నిజంగా ఇంత పెద్ద అవార్డు రావడం సాధారణ విషయం కాదు. సచిన్ టెండూల్కర్ 1988 లో మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబై తరఫున ఆడి గుజరాత్ పై 100 పరుగులు సాధించాడు.

అయితే నిజంగా 15 సంవత్సరాలకే అంత అద్భుతమైన సెంచరీను సాధించడం గొప్ప విషయం. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్లలోనే సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సచిన్ టెండూల్కర్ 1989లో ఆడడం కంటే ముందే క్రికెట్ ఆడారట.

సచిన్ టెండూల్కర్ ఇండియా తరఫున ఆడలేదు. పాకిస్థాన్ జట్టుతో ఆడాడు. ఇండియా క్రికెట్ టీం లోకి రాక ముందే పాకిస్థాన్ జట్టు తో ఒక మ్యాచ్ ఆడాడు. పాకిస్తాన్ టీం తో పాటు సచిన్ టెండూల్కర్ ఫీల్డింగ్ చేశాడు. ఇది 1987లో జరిగింది. ఫెస్టివల్ మ్యాచ్ సమయంలో సచిన్ టెండుల్కర్ పాకిస్తాన్ టీం లో ఫీల్డర్ గా వ్యవహరించాడు.

ముంబై స్టేడియంలో సచిన్ ఆడడం జరిగింది. అయితే సచిన్ ఆడడానికి కారణం ఏమిటంటే..? అది భోజనం సమయం కావడంతో జావేద్ మియాందాద్ మరియు అబ్దుల్ ఖాదిర్ ఫీల్డ్ ని వదిలి వెళ్లడంతో సచిన్ టెండూల్కర్ ని ఫీల్డింగ్ చేయమన్నారు. ఇలా సచిన్ టెండుల్కర్ పాకిస్తాన్ తో కలిసి ఫీల్డింగ్ చేసారు.


End of Article

You may also like