అమెరికాలో సెటిల్ అవుదామని కెనడా వెళ్లారు.. కానీ కుటుంబమంతా దుర్మరణం.. కంటతడి పెట్టిస్తున్న దారుణ ఘటన..!

అమెరికాలో సెటిల్ అవుదామని కెనడా వెళ్లారు.. కానీ కుటుంబమంతా దుర్మరణం.. కంటతడి పెట్టిస్తున్న దారుణ ఘటన..!

by Megha Varna

Ads

చాలామంది భారతీయులకి విదేశాల్లో సెటిల్ అవ్వాలని కల ఉంటుంది. కొంత మంది అయితే వివిధ కారణాల వల్ల విదేశాలకు వెళ్లి అక్కడే సెటిల్ అవుతూ ఉంటారు. తాజాగా విదేశాలకు వెళ్ళిన భారతీయ కుటుంబం దారి మధ్యలోనే మృతి చెందారు. ఈ విషాద ఘటన జనవరి 19న చోటు చేసుకుంది.

Video Advertisement

కెనడా అమెరికా సరిహద్దుల్లో ఒక కుటుంబం తనువు చాలించింది. ఇక అసలు ఏమైంది అనే దాని గురించి చూస్తే..జగదీశ్‌ బల్‌దేవ్‌భాయ్‌ పటేల్‌ (39) అతని భార్య వైశాలినిబెన్‌ (37), కుమార్తె విహంగి (11), కొడుకు ధార్మిక్‌ పటేల్‌ (3) కెనెడా ఫ్లైట్ ఎక్కారు. అక్కడికి వెళ్లిన జగదీష్ కుటుంబ సమేతంగా చలికి తట్టుకోలేక చనిపోయినట్లు అధికారులు గుర్తించారు.

అధికారులు వీళ్ళని భారతీయులుగా గుర్తించారు. ఈ కుటుంబం జనవరి 12న కెనడాకి టూరిస్ట్ వీసా మీద వచ్చారు. వీళ్ల సొంతూరు గుజరాత్ లోని గాంధీ నగర్ జిల్లా కలోల్‌ తహశీల్‌లోని దింగుచా గ్రామం. ఈ గ్రామంలో చాలా మంది విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఇలా స్థిరపడడం అక్కడ గౌరవంగా భావిస్తారు. బంధువులెవరూ కనుక విదేశాల్లో సెటిల్ అవ్వకపోతే పెళ్లి సంబంధాలు కూడా ఇవ్వరట. అందుకని అందరి లాగే తాను కూడా విదేశాలకు వెళ్లాలని అనుకున్న జగదీష్ జనవరి 12 న కుటుంబంతో సహా కెనడా ఫ్లైట్ ఎక్కాడు. అనధికారికంగా అమెరికా వెళ్ళాలని అనుకున్నాడు.

స్థానిక ఏజెంట్లు సహాయంతో కెనడాలోని మానిటోబా దగ్గర సరిహద్దు దాటడానికి ప్రయత్నం చేశారు ఈ కుటుంబం. వాహనాల నుంచి దిగిపోయి కాలినడకన సరిహద్దు దాటాలని అనుకున్నారు. అయితే అక్కడ మైనస్‌ 35 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వాతావరణానికి తట్టుకోలేక జగదీష్ కుటుంబం మృతి చెందింది.

ట్రావెల్ ఏజెంట్లు సహాయం చేస్తామన్నారు కానీ గస్తీ ఎక్కువగా కావడంతో మార్గం మధ్యంలోనే వాళ్ళని వదిలేశారు. ఈ విపరీతమైన చలిని తట్టుకోలేక పోయారు. దీంతో ఊపిరి వదిలేశారు. విదేశాల్లో స్థిరపడాలంటే కచ్చితంగా సరైన పత్రాలు ఉండాలి లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.


End of Article

You may also like