సిగ్గుచేటు…ఇలాంటి సమయంలో అలా చేస్తారా? మిస్టర్ కూల్ భార్య … ఓ రేంజ్ లో ఫైర్ …

సిగ్గుచేటు…ఇలాంటి సమయంలో అలా చేస్తారా? మిస్టర్ కూల్ భార్య … ఓ రేంజ్ లో ఫైర్ …

by Sainath Gopi

కరోనా మహమ్మారిని తరిమికొట్టే నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు సినీ, రాజకీయ, క్రీడా రంగంకి చెందినవారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, నితిన్, జూనియర్ ఎన్ఠీఆర్…ఇలా టాలీవుడ్ నుండి నటులు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేసారు. క్రీడా రంగం నుండి సచిన్ టెండూల్కర్ 50 లక్షలు, గంగూలీ 50 లక్షలు.. పీవీ సింధు 10 లక్షలు చేశారు.

Video Advertisement

ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన వంతు సహాయంగా ఓ ఎన్జీవో ద్వారా లక్ష రూపాయలు సహాయ నిధికి అందించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ వార్త రావడంతో అంతయంత ధనవంతులైన క్రికెటర్ లో ఒకరైన ధోని అంత తక్కువ డొనేట్ చేయడం ఏంటి అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేసారు. ఈ వార్తను ప్రచురించిన మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ధోని భార్య సాక్షి.

బాధ్యతాయుతమైన జర్నలిజం అదృశ్యమైనందుకు ఆశ్చర్యం వేస్తోందన్న సాక్షి. సిగ్గు అనిపించడం లేదూ.. అని ట్వీట్ లో ప్రశ్నించింది. కరోనా విషయంలో ధోనీ కచ్చితంగా ఎంత ప్రకటించాడన్న విషయాన్ని మాత్రం సాక్షి వెల్లడించలేదు. అయితే రూ. 12.5 లక్షలు విరాళంగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న పుణెకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థకు ధోనీ రూ. లక్ష విరాళంగా ఇచ్చాడే తప్ప కరోనా నిధికి కాదని ఓ వార్తా సంస్థ తెలిపింది.

ప్రపంచ కప్ తర్వాత ధోని గ్రౌండ్ లో కనిపించలేదు. అతని ఆట కోసం ఫాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ తో ఆ ముచ్చట తీరనుంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ప్రాక్టీస్ మ్యాచ్ లో బౌండరీలతో విశ్వరూపం చూపించాడు ధోని. ఇక ఈ ఐపీఎల్ లో ధోని ఫాన్స్ కి పండగే అని ఫిక్స్ అయిపోయాము. ఇంతలో ఐపీఎల్ కి కరోనా కష్టం వచ్చి పడింది. మరి టీ 20 వరల్డ్ కప్ లో ఆడతాడో లేదో చూడాలి.


You may also like

Leave a Comment